Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..

కరెంట్ కొట్లాటలు అనే టాపిక్‌ రాగానే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఠక్కున గుర్తొచ్చేదేంటి.. ఇంకేటి..? బషీర్‌బాగ్ ఫైరింగ్ ఎపిసోడ్. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వామపక్షాలు రోడ్డెక్కితే పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. అప్పటి ప్రభుత్వంపై పడ్డ ఆ తూటా మరక ఇప్పటికీ చెరిగిపోలేదు. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కొత్త ప్రభుత్వం వచ్చింది.. పోయింది. పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో బషీర్‌బాగ్‌ ఎపిసోడ్‌ను మెమొరీ బ్యాంక్ నుంచి మళ్లీ బైటికి తీశారు. ఈసారి కరెంట్ తీగల సబ్జెక్ట్‌లో ఎఫెన్స్‌ గేమ్ ఆడుతోంది కారు పార్టీ. మ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డిఫెన్స్ గేమ్ ఏంటి? అనేది తెలుసుకుందాం..

Telangana: అటు ఎల్‌నినో.. ఇటు పెరిగిన డిమాండ్.. తెలంగాణలో విద్యుత్ మంటలు..
Telangana Power Politics

Updated on: Oct 08, 2026 | 10:01 PM

మోటార్లకు మీటర్లు పెడితే ఊరుకునేది లేదని, 24 గంటల కోతల్లేని కరెంట్ ఎక్కడని.. నిన్నమొన్నటిదాకా సోసోగానే కొట్లాడింది కారు పార్టీ. ఇప్పుడు ఫుల్‌టుఫుల్ కరెంట్‌నే మెయిన్ ఎఫైర్‌గా మార్చుకుని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. ఉత్పత్తి, నిర్వహణా లోపాలు, కోతలు, ప్రైవేటీకరణ ఎత్తుగడలు.. ఇలా అన్ని వైపుల నుంచీ ఎటాక్ షురూ చేసి, విద్యుత్ శాఖనే ఉక్కిరిబిక్కిరి చేయాలన్నది బీఆర్‌ఎస్ ఆలోచన. కానీ, కరెంట్ మంత్రి భట్టి అంత ఈజీగా ఉక్కిరిబిక్కిరి అయ్యేలా కనిపించడం లేదు. ప్రతిపక్షం తీరును ఎండగడుతూనే, ప్రభుత్వ పక్షాన కావల్సినంత వివరణ ఇచ్చుకుంటున్నారు. సర్కారువారిని ఉక్కపోతకు గురిచేయాల్సిందేనన్న కమిట్‌మెంట్‌ని మాత్రం వదిలిపెట్టడం లేదు బీఆర్ఎస్. అందుకేనేమో, పవర్ సెక్టార్‌ చుట్టూ స్టేట్‌వైడ్ పొలిటికల్ వార్.. ఇలా హైపర్ టెన్షన్లు పుట్టిస్తోంది. కరెంట్ తీగల చుట్టూ కందిరీగల్లా మూగిననట్టున్నాయి తెలంగాణలో అధికారప్రతిపక్షాలు. మీ పదేళ్లు, మా మూడేళ్లు అంటూ తెలంగాణలో కరెంటు శాఖ పనితీరుపై క్రెడిట్‌ వార్ షురూ ఐనట్టుంది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాలపై రాజకీయ యుద్ధమే జరుగుతోంది. ఏకంగా పవర్‌సెక్టార్‌నే అమ్మకానికి పెట్టారన్నంత ఘాటుగా వినిపిస్తున్నాయి ఆరోపణలు. స్టేట్‌లెవల్‌లో ఆరోపణలతో సరిపెట్టకుండా గ్రౌండ్‌లెవల్‌లో ఉద్యమానికీ సిద్దమైంది బీఆర్ఎస్‌ పార్టీ. ఇప్పటికే అనేక మండలాల్లో రైతుదీక్షల పేరుతో సర్కారుకు వ్యతిరేకంగా అన్నదాతల్ని...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి