MLC Kavitha: ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి.. సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత..

సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, సీబీఐ ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు.

MLC Kavitha: ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి.. సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత..
Mlc Kavitha
Follow us

|

Updated on: Dec 03, 2022 | 7:23 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో సెగలు పుట్టిస్తోంది. ఈడీ రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ క్రమంలో అరెస్టు చేసినా సిద్ధమే అంటూ కవిత.. సవాల్‌ చేసిన రెండో రోజే విచారణకు హజరవ్వాలంటూ సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాగా.. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఫిర్యాదు ఒరిజినల్ కాపీ, సీబీఐ ఎఫ్‌ఐఆర్ కాపీ అందించాలంటూ కవిత సీబీఐ అధికారులను కోరారు. ఈ నెల 6న తన ఇంట్లోనే విచారణకు వివరణ ఇస్తానని కవిత తెలిపారు. విచారణకు ముందు ఈ రెండు కాపీలను కవిత కావాలంటూ కోరారు. ఈ మేరకు కవిత శనివారం సీబీఐకి లేఖ రాశారు.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నోటిసులు ఇవ్వగా.. క్లారిఫికేషన్ కోసం నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం విచారణకు రావాలని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది.

MLC Kavitha

MLC Kavitha – CBI

దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలంటూ కవితలో లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.