Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. జూన్ 5 నుంచి పెరగనున్న వాటి ధరలు.. అమల్లోకి కొత్త నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 5వ తేదీ నుంచి రాష్ట్రంలో పెంచిన భూముల విలువలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అధ్యయనం చేసిన తర్వాత ధరలను పెంచినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగనున్నాయి.

Telangana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. జూన్ 5 నుంచి పెరగనున్న వాటి ధరలు.. అమల్లోకి కొత్త నిర్ణయం..
Land 3

Updated on: Jun 03, 2026 | 8:32 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సవరించిన భూముల మార్కెట్‌ ధరలు ఎప్పటినుంచి అమల్లోకి వస్తాయనే దానిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఇటీవల కొత్త ధరలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని జూన్‌ 5వ తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. భూముల సవరణ ప్రక్రియ అనేది శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా కొత్త విలువలు ఫిక్స్ చేసినట్లు తెలిపారు. నిపుణుల సూచనలతో పాటు అధికారుల సలహాలు తీసుకున్న అనంతరం ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ప్రాంతాలవారీగా మార్కెట్‌ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించినట్లు పొంగులేటి పేర్కొన్నారు.

కొత్త ధరల అవసరం అందుకే..

రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మార్కెట్‌ ధరలు, విలువలు ఎలా ఉన్నాయనే దానిపై ప్రభుత్వం పరిశీలన చేపట్టింది. అలాగే గ్రామీణ, పట్టణ మార్కెట్‌ విలువల సవరణ కమిటీలు కూడా రీసెర్చ్ చేపట్టాయి. అభివృద్ధి, భూముల డిమాండ్‌, మార్కెట్‌ పరిస్థితులు, ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌, కొత్త రోడ్లు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి వాటిపై అధ్యయనం చేశారు. ఇప్పటికే అధిక ధర ఉన్న ప్రాంతాల్లో ధరలను స్ధిరంగా ఉంచారు. వ్యవసాయ భూములతో పాటు ప్లాట్లు, అపార్ట్‌మెంట్లకు కనీస రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది. 2021 తర్వాత నిర్మాణ వ్యయాలను సవరించారు.  దీంతో కొత్త ధరల అవసరం ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది. అత్యంత పారదర్శకంగా సవరణలు చేపట్టినట్లు పొంగులేటి స్పష్టం చేశారు. కాగా  కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలోని అన్ని ఫోర్లకు ఒకేలా ధరలు ఉండేలా నిర్ణయించారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో భూముల విలువ పెరగనుండగా.. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా జూన్ 5వ తేదీ నుంచి పెరగనున్నాయి. దీంతో భూములు కొనుగోలు చేసేవారితో పాటు పెట్టుబడిదారులపై మరింత భారం పడనుంది. అలాగే

Follow Us