TS Inter: ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే

|

Mar 29, 2024 | 6:50 AM

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌, ఎయిడెడ్ ఇంటర్‌ కాలేజీలకు మార్చి 31వ తేదీ నుంచి మే31వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. దీంతో జూన్‌ 1వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ దీనిని తూచాతప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కాలేజీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు...

TS Inter: ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
Ts Inter
Follow us on

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్‌ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో వేసవి సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు మార్చి 30 తేదీని చివరి వర్కింగ్‌ డేగా ప్రకటించింది. దీంతో మార్చి 31వ తేదీ నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి.

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌, ఎయిడెడ్ ఇంటర్‌ కాలేజీలకు మార్చి 31వ తేదీ నుంచి మే31వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. దీంతో జూన్‌ 1వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ దీనిని తూచాతప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కాలేజీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీన మొదలై మార్చి 19వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,78,527 మంది ఫస్ట్‌ ఇయర్‌. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు.

కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలఖారుపలో వాల్యుయేషన్‌ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక పరీక్షా ఫలితాలను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది మే నెలలో ఫలితాలను విడుదల చేయగా ఈసారి కాస్త ముందుగానే ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..