Telangana: విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా.. కరోనా నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40శాతంగా ఉందని పేర్కొన్నారు. 

Telangana: విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా.. కరోనా నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు
Telangana High Court
Follow us

|

Updated on: Feb 03, 2022 | 12:13 PM

Telangana Corona News: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన(online classes) కూడా కొనసాగించాలని సూచించింది. ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్​(Hyderabad)లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి  హైకోర్టు సూచనలు చేసింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో కరోనా పరిస్థితులపై మరోసారి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక

కాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.40శాతంగా ఉందని పేర్కొన్నారు. నారాయణపేటలో 8.88, కామారెడ్డిలో 8.32, ఆసిఫాబాద్ లో 8 శాతం పాజిటివిటీ రేటు ఉందని వివరించారు. జీహెచ్ఎంసీలో 4.64, మేడ్చల్ లో 3.76, గద్వాలలో 1.45శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని డీహెచ్ కోర్టుకు వివరించారు. 99లక్షల ఇళ్లల్లో జ్వరం సర్వే చేసి 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు ఇచ్చామన్నారు. పిల్లల చికిత్సలకు రాష్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోజుకు లక్షపైగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. సమ్మక్క సారక్క జాతరలో ప్రభుత్వం కోవిడ్ జాగ్రత్తలన్నీ తీసుకుంటుందని చెప్పారు. అక్కడ కరోనా పరీక్షలు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు, ఆస్పత్రి అందుబాటులో ఉంటాయన్నారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దనే బడులు తెరిచామని పాఠశాల విద్యా శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. పాఠశాలల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Also Read: APSRTC: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..