Telangana Govt: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎక్కడికక్కడ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు.. ఎందుకో తెలుసా..!

Telangana Govt: తెలంగాణ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు రాష్ట్ర పోలీసులు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న చాలా లారీలు

Telangana Govt: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎక్కడికక్కడ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు.. ఎందుకో తెలుసా..!
Telangana Ps
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Nov 27, 2021 | 8:40 AM

Telangana Govt: తెలంగాణ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు రాష్ట్ర పోలీసులు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న చాలా లారీలు, ట్రాక్టర్లను వెనక్కి పంపుతున్నారు అధికారులు. వివరాల్లోకెళితే.. ధాన్యం కొనుగోలుపై ఇప్పటికే తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. అది చాలదన్నట్టు ఇతర రాష్ట్రాల రైతులు తమ ధ్యాన్యాన్ని తెలంగాణలోకి తీసుకొస్తున్నారు. దీంతో సమస్య మరింత పెరిగింది. ఇది గమనించిన అధికారులు, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో 3 చోట్ల ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. కేటీ దొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలం బల్గెర, ఉండవల్లి మండలం పుల్లూరు వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు అధికారులు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన బృందం ధాన్యం రాకను పర్యవేక్షిస్తోంది. పుల్లూరు చెక్‌పోస్టు వద్దకు ఏపీ నుంచి ధాన్యం లోడుతో వచ్చిన లారీలను వెనక్కి పంపారు అధికారులు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, తెలంగాణలో కనీస మద్దతు ధరకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ధాన్యం లారీలను వెనక్కి పంపుతున్నామని చెబుతున్నారు పోలీసులు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వ్యాపారులు ధాన్యం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు అధికారులు. ఆయా రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని గుర్తించారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అనుమతించడం లేదు. అయితే, వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెబుతున్నారు ప్రభుత్వ పెద్దలు.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు

Latest Articles