Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు.. ఖాళీల లెక్క తేల్చే పనిలో మంత్రి హరీష్ రావు

|

Jul 11, 2021 | 5:23 PM

తెలంగాణలో నిరుద్యోగుల కలను నెరవేర్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పనిలో...

Telangana Jobs: ఉద్యోగాల భర్తీపై ఆర్థికశాఖ కసరత్తు.. ఖాళీల లెక్క తేల్చే పనిలో మంత్రి హరీష్ రావు
Minister Harish Rao
Follow us on

నిరుద్యోగుల కలను నెరవేర్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన పనిలో బిజీగా మారాయి అన్ని ప్రభుత్వ విభాగాలు. ఖాళీగా ఉన్న ఉద్యోగల లెక్క తేల్చేందుకు కసరత్తు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా  ఖాళీలకు సంబంధించి ఆర్థికశాఖ కూడా రంగంలోకి దిగింది. శనివారం కొన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు.. ఆదివారం మిగతా శాఖల కార్యదర్శులు, అధికారులతో కలిసి సమావేశమయ్యారు.

ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను మరోసారి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి… ప్రస్తుతం ఎంత మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్నారనే వివరాలను హరీశ్‌రావు పరిశీలిస్తున్నారు.

ఈ నెల 13న జరగనున్న మంత్రివర్గ సమావేశానికి ఖాళీలకు సంబంధించిన పూర్తి నివేదిక రూపంలో అందించాలని CM KCR ఆర్థిక శాఖను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్‌కు నివేదిక సమర్పించనుంది.

ఇవి కూడా చదవండి: Anti-Terrorist Squad: యూపీలో టెన్షన్.. టెన్షన్.. ఓ ఇంటిలో నక్కిన టెర్రరిస్టులు.. ఆపరేషన్ మొదలు పెట్టిన ATS దళాలు

L.Ramana – TRS: కారెక్కేందుకు అంతా రెడీ.. సోమవారం మంత్రి KTR చేతుల మీదుగా TRS సభ్యత్వం తీసుకోనున్న L. రమణ