బిగ్ సండే.. బిగ్ జడ్జ్‌మెంట్ డే. తెలంగాణ దంగల్ తీర్పు నేడే విడుదల. హామీలు..విమర్శలతో పొక్కిలి లేచిన తెలంగాణలో తీర్పు ఎటో లెక్క తేల్చే రిజల్డ్ డేకు తెల్లారింది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కోడ్ కూసింది. ఓట్ల లెక్కింపుకు వేళాయింది.ఉదయం 5 గంటల నుంచే పోలీంగ్ కేంద్రాల దగ్గర సిబ్బంది సందడి మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
తెలంగాణలో నవంబర్ 30న జరిగిన పోలింగ్‌లో 70.66 శాతం ఓటింగ్ జరిగింది. మొత్తం 119 నియోజవర్గాల్లో 2,290 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపుకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2 వేల 417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్ బూతుల సంఖ్య ఆధారంగా ప్రతీ నియోజకవర్గంలో 14 నుంచి 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు కేటాయించారు.
ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు పెట్టారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ,. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే… రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, పటాన్‌చెరు.. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 20 టేబుళ్లను సిద్ధం చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు. ఒక్కో టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. అటు తొలి ఫలితం భద్రాచలం నుంచి వెలువడనుండగా.. ఉదయం 11 గంటలకల్లా ఫలితాల సరళిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
తెలంగాణ పోలింగ్ ఫలితాల కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాంగ్రెస్ అగ్ర నాయకులు మరికాసేపట్లో రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు గవర్నర్ తమిళ్ సై తో సమావేశం కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు లేఖ సమర్పించనున్నారు.
కరీంరనగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఆయనపై 3169 ఓట్లతో గంగుల కమలాకర్ గెలుపొందారు. కాగా బండి సంజయ్ రీకౌంటింగ్ కు డిమాండ్ చేయడంతో రెండు ఈవీయం ల వీవీ ప్యాట్లను అధికారులు లెక్కించారు. చివరకు గంగుల కమలాకర్ గెలిచాడని ప్రకటించారు. ఈ మేరకు గెలిచినట్లు ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారీ మంత్రి.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గ స్థానం ఫలితంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ ఆఖరి రౌండ్(26) లో సుమారు 17 వేల ఆధిక్యంలో కొనసాగుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్. అయితే అజారుద్దీన్ మాత్రం కౌంటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పటాన్ చెరు ఎన్నికల రిజల్ట్స్ కి బ్రేక్ పడింది. చివరి రౌండ్ అయిన 23 రౌండ్ కౌంటింగ్ ని అధికారులు నిలిపివేశారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ రీ కౌంటింగ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఎన్నికల అధికారులు, ROతో మాట్లాడుతున్నారు కాట శ్రీనివాస. మరోవైపు కౌంటింగ్ కేంద్రం ముందు మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ వర్గీయులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
గజ్వేల్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై 45174 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ‘ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో వస్తామని క్యాడర్ కు ధైర్యం నూరి పోశారు. అలాగే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారమే (డిసెంబర్ 4)న తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బందోబస్తు అరేంజ్‌మెంట్స్ చేసుకోవాలని సీపీ హైదరాబాద్ కు ఆదేశాలు అందాయి. కాసేపట్లో ఈ మేరకు మరికాసేపట్లో ఎల్బీ స్టేడియం కు సందీప్ సాందిల్య చేరుకోనున్నారు.
మొత్తం సీట్లు -10
బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3
– మెదక్
ఇక్కడ మైనంపల్లి హన్మంతరావు కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముందు నుంచీ సవాళ్లు, ప్రతిసవాళ్లతో హాట్‌టాపిక్‌గా నిలిచిన మెదక్‌లో రోహిత్ సంచలన విజయం సాధించారు. మెదక్‌పై హరీష్‌రావు స్పెషల్ ఫోకస్ పెట్టినా ఫలితం లేకపోయింది. 26 ఏళ్ల రోహిత్‌కు 87,126 ఓట్లు పోలయ్యాయి. సమీప BRS అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డికి 76,969 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్‌కు 13,657 ఓట్లు పోలయ్యాయి. మైనంపల్లి రోహిత్ 10,157 మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిపై గెలుపొందారు.
– అందోల్
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహకు 1 లక్షా 3,104 వేల ఓట్లు పోలయ్యాయి. సమీప BRS అభ్యర్థి చంటి క్రాంతికిరణ్‌కు 85,677 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి బాబుమోహన్‌కు 5,462 ఓట్లు పోలయ్యాయి. దామోదర రాజనర్సింహ 27,427 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
– నారాయణఖేడ్
ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి గెలుపొందారు. పట్లోళ్ల సంజీవరెడ్డికి 70,187 ఓట్లు పోలయ్యాయి. BRS అభ్యర్థి భూపాల్‌రెడ్డికి 67,333 ఓట్లు పోలయ్యాయి. BJP అభ్యర్థి సంగప్పన్‌కు 6,521 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డి 2,854 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
– నర్సాపూర్
ఇక్కడ BRS తరఫున సునీతాలక్ష్మారెడ్డి గెలుపొందారు. సునీతాలక్ష్మారెడ్డికి మొత్తం 88,104 ఓట్లు పోలయ్యాయి. 9,167 ఓట్ల మెజార్టీతో ఆమె విజయం సాధించింది. సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డికి 78,957 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్‌కు 22 వేల 713 ఓట్లు పోలయ్యాయి.
– దుబ్బాక
ఇక్కడ BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై 53,707 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. కొత్త ప్రభాకర్‌రెడ్డికి 97,451 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు 43,744 వేల ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్‌రెడ్డికి 24,947 ఓట్లు పడ్డాయి.
– జహీరాబాద్
ఇక్కడ BRS అభ్యర్థి కొనెంటి మాణిక్‌రావు గెలుపొందారు. మాణిక్‌రావుకు 96,913 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌కు 83,620 ఓట్లు పోలయ్యాయి. మాణిక్‌రావు 13,293 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద సస్పెన్షన్ వేటు వేసింది. ఈ రోజు ఉదయం మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డికి వెళ్లిని డీజీపీ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంలు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున డీజీపీపై చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే డీజీపీ రేవంత్ రెడ్డిని కలువడం ఈసీ తప్పుబట్టింది.
Telangana Assembly Elections Result: ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష జరపనున్నారు. హైదరాబాద్ సీపీతో డీజీపీ సమావేశం నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తుపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించనున్నారు.
సోమవారం కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం సీఎల్పీ సమావేశం జరుగనుంది. దీంతో సీఎల్పీ లీడర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. రేపు సాయంత్రం సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Telangana Assembly Elections Result: గెలిచిన ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని డీజీపీ ఆదేశించారు. 2+2 గన్‌మెన్‌లను కేటాయించాలని డీపీజీ అంజనీకుమార్ ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ సీపీతో సమక్ష జరిపారు.
Telangana Assembly Elections Result: కేసీఆర్ తన సీఎం పదవీకి రాజీనామా చేశారు. ఓఎస్టీ ద్వారా రాజ్ భవన్ కు లేఖ పంపించిన కేసీఆర్.. సొంత వాహనంలో ఫామ్ హౌజ్ కు బయలుదేరి వెళ్లిపోయారు.
Telangana Assembly Elections Result: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామారెడ్డి బయలుదేరారు. మరికాసేపట్లో కామారెడ్డిలో మీడియాతో మాట్లాడనున్నారు. 8 స్థానాల్లో బీజేపీ గెలుపు పొందింది.
ఓటమి పాలైనవారు..
Telangana Assembly Elections Result: రేవంత్‌ని కలిసి ప్రమాణస్వీకారంపై చర్చించినట్లు డీజీపీ అంజనీకుమార్ అన్నారు. ప్రమాణస్వీకారానికి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, రేపటి నుంచి 9వ తేదీ వరకు అన్ని ప్రాంతాల్లో.. బందోబస్తు ఏర్పాటు చేయాలని రేవంత్ చెప్పారు అన్డీనారు. ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకారం ఉంటుందన్నారు డీజీపీ
Telangana Assembly Elections Result: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం, కేటీఆర్ ట్వీట్స్, ఇతర నేతల వ్యాఖ్యల గురించి తెలుసుకుందాం.
Telangana Assembly Elections Result:
— గ్రేటర్ హైదరాబాద్‌లో సత్తా చాటిన బీఆర్‌ఎస్
— 29స్థానాలకుగాను 17చోట్ల బీఆర్‌ఎస్ హవా
— గ్రేటర్‌లో ఒకే స్థానానికి పరిమితమైన బీజేపీ
— ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్
–పాతబస్తీలో పట్టు నిలబెట్టుకున్న ఎంఐఎం
Kamareddy Assembly Election Result: కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న కామారెడ్డి.. వెంకట రమణారెడ్డి గెలుపొందారు. రమణారెడ్డి కేసీఆర్‌పై 6 వేల మెజార్టీతో గెలుపొందారు.
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాసేపట్లో రాజ్‌భవన్‌కు రానున్నారు. దీంతో కేసీఆర్ రాజీనామాను గవర్నర్ కు సమర్పించనున్నారు.
ఎన్నికలకు ముందు తెలంగాణకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరికి సహాకరం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి అవకాశం ఇచ్చారని అన్నారు. అలాగే ప్రగతిభవన్‌ను అంబేద్కర్ ప్రజాభవన్‌గా మారుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో 21రోజులు సాగిందన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్‌గా మార్చుతామన్నారు. సామాన్యుల కోసం సచివాలయ గేట్లు తెరుచుకుంటాయని అన్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామన్నారు.
డిసెంబర్ 3 చరిత్రలో నిలిచిపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించడానికి అవకాశం ఇచ్చారని అన్నారు. ఈ విజయం అమరవీరులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు.తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారన్నారు.
Telangana Assembly Elections Result: తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. గాంధీ భవన్‌లో సంబరాలు జరుపుకొంటున్నారు. డీకే శివకుమార్, రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
Telangana Assembly Elections తెలంగాణ ఎన్నికల్లో మంత్రులు ఓటమి పాలయ్యారు.
Telangana Telangana Assembly Elections Result: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎటు చూసినా కాంగ్రెస్‌దే హవా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌లోని ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. మంత్రులు సైతం ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
— ధర్మపురి, వరంగల్ వెస్ట్‌లో బీఆర్‌ఎస్‌కి చేదు అనుభవం
— బీఆర్‌ఎస్ స్థాపన తర్వాత ఓటమి ఎరగని రెండు నియోజకవర్గాలు
— తాజాగా ధర్మపురి, వరంగల్ వెస్ట్‌లో బీఆర్‌ఎస్ ఓటమి
— రెండుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
— ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓటమి
— వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినయ్‌భాస్కర్ ఓటమి
— ఈశ్వర్‌పై లక్ష్మణ్‌కుమార్ గెలుపు
— వినయ్‌భాస్కర్‌పై నాయిని రాజేందర్ గెలుపు
— ఉమ్మడి వరంగల్‌లో 12స్థానాలకు గాను 10చోట్ల కాంగ్రెస్ గెలుపు
Telangana Telangana Assembly Elections Result: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎటు చూసినా కాంగ్రెస్‌దే హవా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌లోని ప్రముఖులు కూడా ఓటమి పాలయ్యారు. మంత్రులు సైతం ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ తూర్పు – కాంగ్రెస్ (కొండా సురేఖ) విజయం
వరంగల్ పశ్చిమ – కాంగ్రెస్ (నాయిని రాజేందర్ రెడ్డి) విజయం
ములుగు – కాంగ్రెస్ (సీతక్క) విజయం
పరకాల – (కాంగ్రెస్) రేవూరి ప్రకాశ్ రెడ్డి గెలుపు..
భూపాలపల్లి – (కాంగ్రెస్ )గండ్ర సత్యనారాయణ రావ్ విజయం
నర్సంపేట – (కాంగ్రెస్) దొంతి మాధవ రెడ్డి గెలుపు
వర్దన్నపేట – (కాంగ్రెస్) నాగరాజు గెలుపు
డోర్నకల్ – (కాంగ్రెస్) రాంచంద్రనాయక్ గెలుపు
మహబూబాబాద్ – (కాంగ్రెస్) మురళినాయక్ గెలుపు
జనగామ లో – (బీఆర్‌ఎస్) అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు
స్టేషన్ ఘనపూర్ – (బీఆర్‌ఎస్) అభ్యర్థి కడియం శ్రీహరి ముందంజ..
పాలకుర్తి లో – కాంగ్రెస్ అభ్యర్థి యశశ్వినిరెడ్డి ఆధిక్యం.
Maheshwaram Telangana Assembly Elections Result: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి భారీ విజయం సాధించారు. 26320 ఓట్ల మెజారిటీతో ఘన విజయం. తన సమీప అభ్యర్థి బిజెపికి చెందిన అందెల శ్రీరాములు యాదవ్ పై ఘన విజయం.
Telangana Assembly Elections Result: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ విజయం
గోషామహల్‌లో రాజాసింగ్ (బీజేపీ) గెలుపు
నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ) విజయం
Telangana Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధిస్తోంది.
— 2018లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి
— తాజాగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినవారిలో 8మంది విజయం
— ఈ ఎన్నికల్లో కొల్లాపూర్, కల్వకుర్తి, నకిరేకల్, తుంగతుర్తి, ఖమ్మం, పాలేరు, పినపాక, ఇల్లందు, జగిత్యాల, ఖానాపూర్ అభ్యర్థులు గెలుపు
Telangana Assembly Elections Result: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీఆర్‌ఎస్ పార్టీకి వరుసగా రెండు సార్లు ప్రభుత్వాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఫలితం గురించి బాధపడలేదు, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా నిరాశ చెందాను. కానీ దీన్ని ఒక పాఠంగా తీసుకుంటాము. తిరిగి పుంజుకుంటాము. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. 7 స్థానాల్లో బీఆర్‌ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ కేవలం 3 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్ వెనుకంజలో కొనసాగుతున్నారు. ఆయనపై బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆధిక్యం చూపిస్తున్నారు. 15వ రౌండ్ పూర్తయ్యేసరికి గంగుల 10,036 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కందాళపై 52,207ఓట్ల మెజార్టీతో గెలుపు పొందారాయన.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఇక్కడ కాంకాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ 9, 238 ఓట్ల మెజార్టీ తో విజయం సాధించారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ ఘన విజయం సాధించారు. 28,329 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థిపై గెలుపొందారాయన.
చెన్నూరు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కు సుమన్ పై 37, 189 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు వివేక్.
పరిగిలో కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ‘ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలని ఫిక్స్ అయ్యారు. ఆరు గ్యారెంటీల పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి. వికారాబాద్ జిల్లాలో నాలుగుకు నాలుగు స్థానాలు కాంగ్రెస్ గెలవడం సంతోషం. పరిగికి ఇన్నిరోజులు అన్యాయం జరిగింది. ఇకపై నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా’ అని రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ఓటర్లు ఝలక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన 9మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓటమి పాలయ్యారు. కొత్తగూడెంలో వనమా, పినపాకలో రేగా కాంతారావు, వైరాలో హరిప్రియ, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణ, అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు, పాలేరులో ఉపేందర్ రెడ్డి, ఎల్లారెడ్డిలో సురేందర్, కొల్లాపూర్‌లో హర్షవర్దన్ పరాజయం పాలయ్యారు.
తెలంగాణలో జనసేన ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 8 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. తీవ్ర ఉత్కంఠ రేపిన కూకట్ పల్లి స్థానంలోనూ జనసేన అభ్యర్థి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
వనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి నిరంజన్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇక్కడ మంత్రి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Kamareddy Assembly Elections Result: కామారెడ్డి ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆధిక్యం మారుతోంది. 2,100 ఆధిక్యంలోకి బీజేపీ అభ్యర్థి రమణారెడ్డి ముందంజలో ఉన్నారు.
Quthbullapur Assembly Elections Result: కుత్బుల్లాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి వివేకానంద విజయం సాధించారు. 85 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
Kothagudem Assembly Elections Result: కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.
Secunderabad Assembly Elections Result: సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్‌పై 37 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపొందారు.
Kamareddy Assembly Elections Result: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మధన్‌మోహన్ విజయం సాధించారు.
సతన్‌నగర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హ్యట్రిక్ విజయం సాధించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎవరూ వరుసగా విజయం సాధించలేదు. ఇప్పుడు హ్యట్రిక్ విజయం రికార్డ్‌ను తలసాని తన ఖాతాలో వేసుకున్నారు.
Kamareddy Assembly Elections Result: కామారెడ్డిలో హోరా హోరీ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య దోబూచులాడుతున్న ఆధిక్యం. 12వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి 260 ఓట్ల మెజార్టీ వచ్చింది. క్రమంగా బీజేపీ ఓట్లు సైతం పెరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య 2 శాతం ఓట్ల తేడా ఉంది. సీఎం కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక 13వ రౌండ్ ముగిసేసరికి బిజెపి అభ్యర్థికి 1007 ఆధిక్యంలో ఉన్నారు.
నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు జయ్‌వీర్‌రెడ్డి గెలుపొందారు.
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు.
Mulugu Assembly Elections Result: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై రాజగోపాల్‌రెడ్డి గెలుపొందారు. అలాగే నల్గొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 54 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.
వరంగల్ పశ్చిమ నియోజవర్గంలో 9వ రౌండ్ ముగిసే సరికి 5618 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి గెలుపొందారు.
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై 23,582 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Telangana Assembly Elections Result: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. మొత్తం ఫలితాల్లో ఇప్పటి వరకు 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఒక స్థానంలో ఎంఐఎం, మూడు స్థానాల్లో విజయం సాధించాయి. అటు ఇంకా 54 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండటంతో దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటేసి హస్తం పార్టీ అధికారం చేపట్టే దిశగా కొనసాగుతోంది.
Palakurthi Assembly Election Result: పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి యశశ్వినిరెడ్డి విజయం సాధించారు.
కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి గెలుపొందారు. 32,800 ఓట్ల తేడాతే బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై విజయం సాధించారు.
హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజయం సాధించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
Medak Assembly Elections Result: మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్.. బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
Ambarpet Assembly Elections Result: అంబర్‌పేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.
Balkonda Assemgly Elctions Result: తెలంగాణలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విజయం 3900 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఆందోల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహా గెలుపొందారు. 24,402 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Dubbaka Assembly Elections Result: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దుబ్బాక నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు.
Nalgonda Assembly Elections Result: తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఎన్నికల ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కు కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. 54 వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Assembly Elections Result: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ లీడ్ లో ఉంది.
Jukkal Assembly Elections Result: జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌షింధేపై సమీప కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు 1734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటికి డీపీజీ అంజనీకుమార్ వెళ్లారు. రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Assembly Elections Result: రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను సీఎం రేసులో ఉన్నానా..? లేదా అనేది అప్రస్తుతం అని అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఈ ఐదేళ్లు ఎలాంటి గొడవలు ఉండవు. సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నామని, సీఎం అభ్యర్థిని ఖర్గే, సోనియాగాంధీ నిర్ణయిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు అక్కడకు వెళ్లారని అన్నారు.
Bhadrachalam Assembly Elections Result: ఉమ్మడిఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎష్ బోణి కొట్టింది. 4466 ఓట్లతో భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు.
Kamareddy Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి ఆధిక్యంతో కొనసాగుతున్నారు. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి రేవంత్‌రెడ్డికి 26,437 ఓట్లు రాగా, సీఎం కేసీఆర్‌కు 24091 ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థికి 23,802 ఓట్లు. దీంతో 2346 ఓట్ల ఆధిక్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారు.
Banswada Assembly Elections Result: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ముందంజలో ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై 8,632 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
Ramagundam Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వరుసగా మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట, ఇల్లందుతో పాటు రామగుండంలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి చందర్‌పై విజయం సాధించారు.
Charminar Assembly Elections Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం బోణి చేసింది. చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు.
Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో హస్తం హవా కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 38 వేల భారీ మెజార్టీతో సమీప బీఆర్‌ఎస్ అభ్యర్థి హరిప్రియపై విజయం సాధించారు.
Aswaraopeta Assembly Elections Result: తెలంగాణలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. తొలి ఫలితం విడుదలైంది. అశ్వరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఆదినారాయణ విజయం సాధించారు
Telangana Assembly Elections: తెలంగాణలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. పాలకుర్తి నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్, నిర్మల్ అభ్యర్థి ఇంద్రకరణ్‌రెడ్డిలు వెనుకంజలో ఉన్నారు. జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), మల్లారెడ్డి (మేడ్చల్), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం)లు ముందంజలో కొనసాగుతున్నారు.
Telangana Assembly Elections: తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం మీద కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Khammam Assembly elections: ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ లో పోలైన ఓట్లను పరిశీలిస్తే..
కాంగ్రెస్ కు పోలైన ఓట్లు.. 7,012
బీఆర్ఎస్ కు పోలైన ఓట్లు.. 4,327
కాంగ్రెస్ ..2,715
ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు 8,386 ఓట్ల ఆధిక్యం
District : Nalgonda Assembly Elections: నల్గొండలో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతోంది.
మొత్తం 12 సీట్లు
లీడ్‌లో
బీఆర్‌ఎస్:01
కాంగ్రెస్ :11
బీజేపీ :0
సీపీఐ: 1
సీపీఎం: 0
MIM:0
Narsapoor Assembly Elections: మెదక్ జిల్లానర్సాపూర్ లో కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ పూర్తయ్యింది.
సునీత లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్)-4698
రాజీ రెడ్డి (కాంగ్రెస్) – 4521
మురళి యాదవ్ (బీజేపీ) – 802
5వ రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు 177 ఓట్ల ఆధిక్యం రాగా, 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 1058 ఆధిక్యం
Banswada Assembly Elections: తెలుగు రాష్ట్రాల్లో స్పీకర్ సెంటిమెంట్‌కు బ్రేక్.. ముందంజలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనసాగుతున్నారు. ఐదు వేల ఓట్ల అధిక్యంతో ముందంజలో కొనసాగుతున్నారు
Telangana Assemly Elections: తెలంగాణలో ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతోంది.
గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల 3వ రౌండ్
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ముందంజలో కొననసాగుతోంది.
1. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్
గ్రేటర్ హైదరాబాద్‌లో ఆధిక్యంలో బీఆర్ఎస్
పలుచోట్ల దూసుకుపోతున్న హస్తం పార్టీ
2. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కు ఆధిక్యత
10 చోట్ల కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్‌ఎస్ లీడ్
మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యత
3. గజ్వేల్‌లో కేసీఆర్ ఆధిక్యం
సిద్దిపేటలో హరీష్‌రావుకు భారీ ఆధిక్యత
19,386 ఓట్ల లీడ్‌లో హరీష్ రావు
4. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యం
11 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ
ఒక స్థానంలో బీఆర్‌ఎస్ లీడ్
5. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోరాహోరీ
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటాపోటీ
కాంగ్రెస్-4, బీఆర్ఎస్-2, బీజేపీ-3 చోట్ల లీడ్
6. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి స్వల్ప ఆధిక్యత
రాజస్థాన్‌లో హోరాహోరీ
చత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ
కల్వకుర్తి నియోజకవర్గంలో్ కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
6వ రౌండ్ ముగిసే సరికి
బీజేపీ…3269
కాంగ్రెస్…4351
బీఆర్ఎస్ …1787
కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్ రెడ్డి 5853 ఓట్ల తో ముందంజ
Siddipet Assembly Election: తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు. హరీష్ రావుకు 19,386 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
Asifabad Assembly elections: ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.
5వ రౌండ్ లో 1876 ఓట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ అభ్యర్థి కోవలక్ష్మీ.
5వ రౌండ్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు
బీఆర్ఎస్-4747
బీజేపి-263
కాంగ్రెస్-2871
ఇండిపెండెంట్-1043
5 వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆసిఫాబాద్ నియోజవర్గం బీఆర్ఎస్ లీడ్ 7115
Mahabubnagar Assembly Elections: మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 906 ఓట్ల లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
చెన్నూరులో ఐదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది.
బీఆర్ఎస్ – 14083
కాంగ్రెస్ – 26123
ఐదవ రౌండ్ ముగిసే సరికి..
కాంగ్రెస్ లీడ్ 17375
Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ పది స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Telangana Assembly Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రౌండ్ రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతోంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి సగానికి పైగా నియోజకవర్గాల్లో లీడ్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, రాజస్థాన్ లో బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ 76 స్థానాల్లో ముందంజలో ఉంది. అటు మధ్య ప్రదేశ్ లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసింది. 150 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 74 స్థానాలు, ఇతరులు ఒక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 53, కాంగ్రెస్ 34, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
Kodangal Assembly Elections: కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 7 రౌండ్లు కౌంటింగ్ పూర్తి అయ్యింది. అన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ముందజంలో ఉన్నారు. రేవంత్ 8000 ఓట్ల తో ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Election: ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
– ఇల్లందు మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (12000) ముందంజ
– పాలేరు మూడో రౌండ్ కాంగ్రెస్ (1649) ముందంజ
– సత్తుపల్లిలో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ (2127) ముందంజ
– మధిర మూడో రౌండ్‌లో కాంగ్రెస్(1641) ముందంజ
– ఖమ్మం మూడో రౌండ్ కాంగ్రెస్ (796) ముందంజ
Telangana Assembly Election: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది
Nakrekal Assembly Election: నక్రేకల్ లో 4వ రౌండ్ ముగిసేసరికి 9992 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం ఆధిక్యంతో ఉన్నారు.
ఆర్ముర్ నియోజకవర్గం రెండు రౌండ్లు కలిపి
BRS 5,812
BJP 11,687
CONG 9,831
BJP అభ్యర్థి రాకేష్ రెడ్డి రెండు రౌండ్లు కలిపి 1,856 లీడ్
పినపాకలో రెండో రౌండ్ ఫలితాలు వెల్లడి..
బీఆర్ఎస్ : 5915
కాంగ్రెస్ : 12159
కాంగ్రెస్ ఆధిక్యం : 6244
గోషామహాల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ వెనుకంజలో ఉన్నారు.