CM Kcr Press Meet: నీతి ఆయోగ్‌ విఫల సంస్థ.. ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్..

CM Kcr Press Meet: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను..

CM Kcr Press Meet: నీతి ఆయోగ్‌ విఫల సంస్థ.. ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ సంచలన కామెంట్స్..
Cm Kcr
Follow us

|

Updated on: Aug 06, 2022 | 4:47 PM

CM Kcr Press Meet: ఆదివారం నాడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదని, ఇదే విషయంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందని, ఎలాంటి ప్రణాళికలు లేకుండా ముందుకు పోతోందని అన్నారు. శనివారం నాడు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్ మరిన్ని అంశాలపై మాట్లాడారు. కేంద్రానివి అన్నీ ఏకపక్ష నిర్ణయాలే అని సీఎం కేసీఆర్ విమర్శించారు.

ప్రస్తుతం భారతదేశం సంక్లిష్ట పరిస్థితిలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, నిరుద్యోగ రేటు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనికి కేంద్ర విధానాలే కారణం అని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై నీతి ఆయోగ్‌లో చర్చించడం లేదని దుయ్యబట్టారు. కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపే అంశాలపై చర్చ లేదని, కేంద్రం నిస్తేజంగా చూస్తూ ఉండిపోతోందని విమర్శించారు.

నీతి ఆయోగ్ విఫలం..

ఇవి కూడా చదవండి

నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడం లేదు. భజనబృందంగా మారింది. 8 ఏళ్ల నీతి ఆయోగ్ సాధించింది ఏమీ లేదు. రూపాయి విలువ పాతాళానికి పడింది. నిరుద్యోగం పెరిగిపోతుంది. 13 నెలల తర్వాత రైతు చట్టాలను రద్దు చేశారు.. 13 రోజుల్లోనే చేసి ఉండొచ్చు కదా. రైతుల పెట్టుబడి డబుల్ అయింది.. సంపాద డబుల్ కాలేదు. ఢిల్లీలో కూడా నీళ్లు దొరకడం లేదు. నీతి ఆయోగ్ ఏం చేసినట్లు? ప్లానింగ్ కమిషన్‌ను తీసేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చి ఏం సాధించారు? అన్ని అంశాల్లోనూ నీతి ఆయోగ్ విఫలమైంది.

ఆ నిబంధనలతో రాష్ట్రాలకు కష్టాలే..

ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్ పడుతుంది. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. కేందాన్నివన్నీ ఏకపక్ష నిర్ణయాలే. కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పూర్తైనా కేంద్రం నిధులు ఇవ్వలేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్ వీడియోను కింద చూడొచ్చు..