మూడు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ షురూ.. స్వయంగా 4బిల్లులు ప్రవేశ పెట్టబోతున్న సీఎం రేవంత్

Updated on: Jan 02, 2026 | 10:18 AM

మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం.

మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ సభ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ గెజిట్ నోటిఫికేషన్లు కూడా సభ ముందు ఉంచుతారని సమాచారం. మరో నాలుగు బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లు, GHMC సవరణ బిల్లుతోపాటు.. తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 కూడా సభ ఆమోదం కోసం ఉంచుతారు. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. అటు.. ఇవాళ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Jan 02, 2026 10:17 AM
Follow Us