Telangana: ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేశాం.. గజ్వెల్ ఘటనపై స్పందించిన సిద్దిపేట సీపీ శ్వేతా..

గజ్వెల్‌లో నిన్న,మొన్న జరిగిన ఇష్యూలో ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేసామన్నారు. వారిని 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లుగా తెలిపారు. నిన్న ఎలాంటి అనుమతి లేకుండా గజ్వెల్ పట్టణంలోకి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్..

Telangana: ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేశాం.. గజ్వెల్ ఘటనపై స్పందించిన సిద్దిపేట సీపీ శ్వేతా..
Siddipet CP Swetha

Updated on: Jul 05, 2023 | 12:44 PM

సిద్దిపేట జిల్లా, జూలై 05: గజ్వెల్ పట్టణంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సిద్దిపేట సీపి శ్వేతా స్పందించారు. మీడియా సమావేశం సీపీ శ్వేతా మాట్లాడుతూ.. గజ్వెల్‌లో నిన్న,మొన్న జరిగిన ఇష్యూలో ఇప్పటికి 11 మందిని అరెస్ట్ చేసామన్నారు. వారిని 14 రోజుల రిమాండ్‌కు తరలించినట్లుగా తెలిపారు. నిన్న ఎలాంటి అనుమతి లేకుండా గజ్వెల్ పట్టణంలోకి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేశామన్నారు. సోసియల్ మీడియాలో వచ్చిన అసత్యపు వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సోషయల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గజ్వేల్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందని.. ఇక ముందు కూడా ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునేకుండా ఉండేందుకు ప్రజలు సహకరించాలన్నారు.

మంగళవారం ఓ వ్యక్తి మద్యం మత్తులో శివాజీ విగ్రహం ముందు మూత్ర విసర్జన చేసిన విషయం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ఈ ఘటనతో గజ్వేల్‌‌ ఒక్కసారిగా ఆందోళనలు మొదలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు శివాజీ విగ్రహం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఆ వ్యక్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అనంతరం స్టేషన్‌ నుంచి శివాజీ విగ్రహం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. తిరిగి వస్తుండగా ర్యాలీలో పాల్గొన్న ఇద్దరిపై గుర్తు తెలియనివారు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో సందీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి.