TSRTC: మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం

|

Dec 22, 2023 | 8:30 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రెండు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అందులో ప్రధానమైనది మహాలక్ష్మీ పథకం. ఈ పథకం ద్వారా అర్టీసీ బస్సుల్లో స్థానిక మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి విశేష స్పందన ఎదురయింది.

TSRTC: మహిళలకు ఉచిత బస్సు ఎఫెక్ట్.. తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
TSRTC MD
Follow us on

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రెండు గ్యారెంటీలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. అందులో ప్రధానమైనది మహాలక్ష్మీ పథకం. ఈ పథకం ద్వారా అర్టీసీ బస్సుల్లో స్థానిక మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి విశేష స్పందన ఎదురయింది. కొన్ని చోట్లు మహిళలు విరివిగా ప్రయాణం చేస్తున్నందున బస్సుల కొరత ఏర్పడింది. దీంతో సమయానికి గమ్యస్థానాలకు చేరాలంటే కాస్త ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో అనేక ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో ప్రజా రవాణాకు ఉపయోగకరంగా ఉండే బస్సులు అద్దెకు తీసుకుంటామని పత్రికా ప్రకటన విడుదల చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. తెలంగాణ ఆర్టీసీకి అత్యవసరంగా అద్దెబస్సులు అవసరమని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ బస్సులను ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వొచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటి సబర్బన్, సిటి మఫిసిల్ బస్సులు అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ టెండర్ కు సిద్దంగా ఉన్న వారు బస్సులకు సంబంధించిన నమూనా, రంగు, మోడల్, అద్దె రేట్లు, కాషన్ డిపాజిట్, వీల్ బేస్, సీటింగ్ సామర్థ్యం, బస్సు బాడీ ప్రమాణాలు, సిట్టింగ్ కెపాసిటీ తదితర వివరాలను దరఖాస్తులో పొందుపరచాలని తెలిపింది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఆర్టీసీ అధికార వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ను సందర్శించాలని కోరింది. అలాగే 9100998230 నంబరుకు సంప్రదించాలని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..