హైదరాబాద్‌ నగరంలో వర్షం.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం

Rain in Hyderabad: హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి వర్షం కురిసింది. నగరంలోని పలుప్రాంతాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి,..

హైదరాబాద్‌ నగరంలో వర్షం.. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం
Andhra Pradesh Rain Alert
Shaik Madarsaheb

|

Feb 19, 2021 | 4:54 AM

Rain in Hyderabad: హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి వర్షం కురిసింది. నగరంలోని పలుప్రాంతాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, నాగోల్‌, సైదాబాద్‌, రామంతాపూర్‌, నారాయణగూడ, గౌలిదొడ్డి, హిమాయత్‌నగర్‌, ఆర్‌కేపురం, బహదూర్‌పురా, పురానాపూల్‌, దూద్‌బౌలి, లంగర్‌హౌస్‌, అత్తాపూర్‌,ఉప్పర్‌పల్లి, నాంపల్లి, జియాగూడ, ఖైరతాబాద్ తదితర‌ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షం కురవడంతో పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

ఇదిలాఉంటే.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వడ‌గ‌ళ్లతో కూడిన వర్షం కురిసే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఉత్తర కర్ణా‌టక నుంచి దక్షిణ మధ్య మహా‌రాష్ట్ర వరకు ఏర్పడిన ఉప‌రి‌తల ద్రోణి ప్రభావంతో వర్షం కురిసింది. ఈ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాకశముందని వెల్లడించింది.

Also Read:

CM KCR: ధరణి విజయవంతమైంది.. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘భూ’ డిజిటల్ సర్వే : సీఎం కేసీఆర్

Advocates Murder: న్యాయవాది దంపతుల హత్య కేసులో ముగ్గురు అరెస్టు.. కీలక విషయాలు వెల్లడించిన ఐజీ నాగిరెడ్డి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu