Telangana: మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?

అకాల వర్షాలతో తెలంగాణలోనూ పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు అపార నష్టం జరిగింది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు బీభత్సం సృష్ఠించాయి. పరిగి మండలంలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది.

Telangana: మండే ఎండల్లో చల్లని కబురు.. వచ్చే 3 రోజులు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోందంటే.?
Rain1

Updated on: Mar 23, 2026 | 7:57 PM

నిన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిమీ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు, అంతర్గత కర్నాటక, మరాత్వాడ మీదుగా పశ్చిమ విదర్భ వరకు సగటు సముద్రం నుంచి 0.9 కిమీ ఎత్తులో ప్రాంతంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిమీ ఎత్తులో ఈరోజు ఏర్పడింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి నాలుగు రోజులలో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనితోపాటు తమిళనాడు, అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది చదవండి: చనిపోయే ముందు సౌందర్య గర్భవతి.. ప్రేమించింది అతడినే.! ఎవ్వరికీ తెలియని నిజం

Follow Us