Precaution Dose: ప్రికాషన్‌ డోస్‌పై కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌రావు.. ఎందుకో తెలుసా.?

Precaution Dose: ప్ర‌భుత్వం వైద్యంలో 18-59 వ‌య‌స్సు వారికి క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌కు ప్రికాష‌న్ డోస్ (బూస్టర్‌ డోస్‌) ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని తెలంగాణ ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు..

Precaution Dose: ప్రికాషన్‌ డోస్‌పై కేంద్రానికి లేఖ రాసిన మంత్రి హరీష్‌రావు.. ఎందుకో తెలుసా.?
Follow us

|

Updated on: Apr 13, 2022 | 1:48 PM

Precaution Dose: కరోనా వైరస్‌ నుంచి మరింత సురక్షితంగా ఉంచేందుకు 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రికాషనరీ డోస్‌ తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభమైంది. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో  18-59 వ‌య‌స్సు వారికి క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌కు ప్రికాష‌న్ డోస్ (బూస్టర్‌ డోస్‌) ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని తెలంగాణ ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) కేంద్రాన్ని కోరారు. భ‌విష్య‌త్‌లో కొత్త వేరియంట్ల ద్వారా క‌రోనా వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌నరీ డోస్‌ ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు మంత్రి హ‌రీశ్ రావు బుధ‌వారం లేఖ రాశారు.

ప్ర‌భుత్వ వైద్యంలో ప్ర‌స్తుతం 60 ఏళ్లు దాటిన వారికి మాత్ర‌మే ప్రికాష‌న్‌ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి ఏప్రిల్ 10 నుంచి ఈ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు ఆసుప‌త్రుల‌కే అనుమ‌తించింది. ఈ క్ర‌మంలో ప్రైవేటుతో పాటు ప్ర‌భుత్వ కేంద్రాల్లోనూ 18-59 ఏళ్ల వ‌య‌స్సున్న‌ వారికి ప్రికాష‌న్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని మంత్రి ఈ లేఖ రాశారు. ఆ దిశ‌గా అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది ఈ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని మంత్రి లేఖ‌లో పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం 18 ఏళ్లు పైబ‌డిన వారికి మొద‌టి డోసును 106శాతం, రెండో డోసును 100 శాతం, 15-17 ఏళ్ల కేట‌గిరీలో మొద‌టి డోసును 90శాతం, రెండో డోసును 73శాతం, 12-14 ఏళ్ల వ‌య‌స్సు వారికి 78 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసింద‌ని తెలిపారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో, వ్యాధి ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డంలో విస్తృతంగా నిర్వ‌హించిన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ఎంతో తోడ్ప‌డింద‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

PAN Card Reprint: మీ పాన్‌ కార్డు పోయిందా..? టెన్షన్‌ అక్కర్లేదు.. ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కొత్త కార్డు వచ్చేస్తుంది!

Forex Markup Fee: వేసవి సెలవుల్లో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 క్రెడిట్ కార్డ్‌లతో ఎన్నో ప్రయోజనాలు