
జిమ్లలో వ్యాయామం చేస్తున్న యువకులు ప్రోటీన్ సప్లిమెంట్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా ఇతర పనితీరు పెంచే మందులను వినియోగిస్తున్నారా అనే విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే జిమ్ సభ్యుల నమోదు వివరాలు, ట్రైనర్ల అర్హతలు, వినియోగంలో ఉన్న సప్లిమెంట్ల నాణ్యత, సంబంధిత అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సమగ్రంగా పరిశీలించారు. యువతలో ఫిట్‌నెస్‌పై పెరుగుతున్న ఆసక్తిని కొందరు దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆరోగ్యానికి హానికరమైన లేదా నిషేధిత పదార్థాల వినియోగాన్ని అరికట్టడం కోసం ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా స్టెరాయిడ్లు, అనధికారిక సప్లిమెంట్ల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పళ్ళు జిమ్లలో దొరికిన సప్లిమెంట్ పౌడర్స్ తోపాటు టాబ్లెట్లు గుర్తించారు. మెడికల్ షాపులో ఉండాల్సిన టాబ్లెట్లు జములలో ఎందుకు ఉన్నాయని వీటిని స్టెరాయిడ్స్ రూపంలో వినియోగించడం చట్టబద్ధతేనా వీటి కొనుగోలుకు ప్రెస్క్రిప్షన్ అవసరమా అనే అంశాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీ చేయించి స్టెరాయిడ్స్ వాడుతున్నట్టు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. సభ్యుల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయడం, అర్హత కలిగిన ట్రైనర్లను నియమించడం, నాణ్యమైన, అనుమతి పొందిన సప్లిమెంట్లను మాత్రమే వినియోగించేందుకు ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ఆరోగ్యానికి హానికరమైన పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.యువతను ప్రమాదకరమైన పదార్థాల బారిన పడకుండా కాపాడడం, ఆరోగ్యకరమైన ఫిట్‌నెస్ సంస్కృతిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.