భారీ వ‌ర్షాలు కార‌ణంగా పోలీస్ శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాలిః డీజీపీ

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషన‌రేట్ల‌లోని ఎస్పీల‌ను ఆదేశించారు డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు..

భారీ వ‌ర్షాలు కార‌ణంగా పోలీస్ శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాలిః డీజీపీ
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 8:59 PM

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రత్తంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమీషన‌రేట్ల‌లోని ఎస్పీల‌ను ఆదేశించారు డీ.జీ.పీ. ఎం.మహేందర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు డీజీపీ కార్యాలయం నుండి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. గత రెండు రోజుల నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను కలసి జిల్లాల కలెక్టర్లు సీ.పీ.లు, ఎస్.పీలతో ఉమ్మడిగా టెలీ కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించి ఏ విధమైన అవాంఛ‌నీయ సంఘటనలు జరగకుండా తగు సూచనలు, సలహాలను ఇస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌తో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లలో పోలీస్ అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అదికారులతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా లోత‌ట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఏ విధమైన ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అత్యంత ప్రాధాన్యతనివ్వాలని డీ.జీ.పీ ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులంద‌రూ అప్రమత్తంగా ఉండాలని డీ.జీ.పీ. మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట