Putta Madhu: గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్టా మధును పోలీలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులు అజ్ఞాతవాసం తర్వాత ఏపీలోని భీమవరంలో పుట్టా మధును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తీసుకువచ్చి విచారణ జరిపారు. ఇందులో భాగంగా తాను ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో, ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో పుట్టా మధు చెప్పుకొచ్చారు. పుట్టా మధు తో పాటు పుట్ట సతీష్ , పుట్టా మధు బినామీ బినామీ కర్ణాటక రాయచూరు లో ఉండే అతని స్నేహితుడు మద్దిపాటి శ్రీనివాసరావు అలియాస్ గుంటూరు శ్రీను లను రామగుండము టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.
మద్దిపాటి శ్రీనివాసరావు తమ్ముడు మద్దిపాటి రామకృష్ణ షెల్టర్ ఇచ్చునట్టు గా పోలీసుల విచారణలో తెలిసింది. రావుల పాలెం దగ్గర ఉన్న భీమవరంలో పుట్టా మధు ఆశ్రయం పొందినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే మద్దిపాటి శ్రీనివాస్ రావు ఫార్చ్యునర్ నెంబర్ 1111 లో తిరిగినట్టు పోలీసులు తేల్చారు. ఇదే కార్ ఫై పుట్టా మధుకర్ ఎమ్మెల్యే అనే స్టిక్కర్ కూడా ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఇక రాయచూరు ఫామ్ హౌస్ లోనే కీలక సమావేశాలు పుట్టా మధు నిర్వహించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలుసుకున్న మధు ఎవ్వరికి చెప్పకుండా మహారాష్ట్రకు వెళ్ళిపోయాడు. అక్కడ రెండు రోజులు ఉండి పోయాడు. అక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి పోయారు. ఆ తర్వాత ఒడిశా.. అక్కడి నుంచి కారులో భీమవరం చేరుకున్నారు. భీమవరంలోని ఓ రిసార్ట్స్‌లో మకాం వేశాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :