ప్రెస్‌క్లబ్ సమీపంలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి..

పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రెస్ క్లబ్ వద్ద.. సోమవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరో 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాఖత్ పాహ్వాని ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రెస్‌క్లబ్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. క్లబ్ సమీపంలో ఓ ప్రదర్శన కార్యక్రమం జరుగుతుండగా ఈ పేలుడు […]

ప్రెస్‌క్లబ్ సమీపంలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి..
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 5:49 AM

పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రెస్ క్లబ్ వద్ద.. సోమవారం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. మరో 20మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక పోలీసులు రెస్క్యూ టీం రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాఖత్ పాహ్వాని ఈ విషయాన్ని ధృవీకరించారు.

ప్రెస్‌క్లబ్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. క్లబ్ సమీపంలో ఓ ప్రదర్శన కార్యక్రమం జరుగుతుండగా ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలన్నీ కదిలిపోయాయి. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన వెంటనే.. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు గల కారణం ఏంటీ.. ఎవరు చేశారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు.

Latest Articles