Hyderabad News: అక్కను వేధిస్తున్న బావ.. అడ్రస్ తెలుసుకుని మరీ వెళ్లి బావమరుదులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Hyderabad News: అక్కను వేదిస్తున్నాడని బావను, బావ అన్నను, బావ స్నేహితుడిని కత్తితో పొడిచారు ఇద్దరు బావమరుదులు. వీరి గొడవలో అడ్డు వచ్చిన బావ అన్న..

Hyderabad News: అక్కను వేధిస్తున్న బావ.. అడ్రస్ తెలుసుకుని మరీ వెళ్లి బావమరుదులు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Crime

Updated on: Mar 11, 2022 | 2:01 AM

Hyderabad News: అక్కను వేదిస్తున్నాడని బావను, బావ అన్నను, బావ స్నేహితుడిని కత్తితో పొడిచారు ఇద్దరు బావమరుదులు. వీరి గొడవలో అడ్డు వచ్చిన బావ అన్న కత్తిపోట్లకు గురై మృతి చెందగా.. మరొక స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక బావ పరిస్దితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళితే.. బాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటూ పేయింటర్‌‌గా పనిచేస్తున్న వెంకటేష్.. తన భార్య రేఖను తరచూ కొడుతూ, గొడవ పడేవాడు. ఇవాళ వెంకటేష్ సుభాష్ నగర్‌లోని తన తల్లి ఇంటికి వచ్చాడు. ఉప్పల్, చిలుకానగర్‌లో నివాసం ఉండే వెంకటేష్ బావమరుదులు, రేఖ సోదరులు ఇద్దరు వినయ్, మధులు.. తమ బావ వెంకటేష్ సుభాష్ నగర్‌లోని తల్లి ఇంట్లో ఉన్నాడనే సమాచారం తెలుసుకున్నారు. బావ వద్దకు వచ్చి తమ అక్కను ఎందుకు వేధిస్తున్నావనే విషయంపై గొడవ పడ్డారు. వీరిమద్య మాటామాటా పెరిగి కోపంతో.. ఇద్దరు బావమరుదులు వినయ్, మధులు తమ బావ వెంకటేష్ పై కత్తులతో దాడి చేశారు. గోడవ ఆపడానికి వెళ్లిన వెంకటేష్ అన్న పోతరాజు(35)కు గొడవలో కత్తిపోట్లకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే గొడవలో మరో స్నేహితుడు క్రిష్ణకు గాయాలయ్యాయి. స్దానికులు, పోలీసులు వెంకటేష్, క్రిష్ణ లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోతరాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని జీడిమెట్ల సిఐ బాలరాజు తెలిపారు. కుటుంబ కలహాలే గొడవకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Egg Curry: ఎగ్ కర్రీ వండలేదని తల్లిపై కోపం.. యువకుడు ఏం చేశాడంటే..?

Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

Blackmail: న్యూడ్‌ కాల్స్‌తో బ్లాక్‌ మెయిల్‌… మాయలేడి వలలో పడి లక్షలు పోగొట్టుకున్న యువకుడు.. వీడియో