ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ సర్కార్‌ సరికొత్త సిస్టమ్.. మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు..

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) నాణ్యత లేని (NSQ) మందుల గుర్తింపుపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఇది మెడికల్ షాపులు, తయారీదారులు, పంపిణీదారులకు తక్షణమే హెచ్చరికలను చేరవేస్తుంది, గతంలో ఉన్న 15-20 రోజుల ఆలస్యాన్ని తగ్గిస్తుంది. ఈ డిజిటల్ విధానం ప్రజల ఆరోగ్య రక్షణకు, అనర్హ మందులు మార్కెట్‌లోకి చేరకుండా అడ్డుకోవడానికి తోడ్పడుతుంది. DCA ల్యాబ్‌ల విస్తరణకు కూడా ప్రణాళికలు రూపొందించింది.

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ సర్కార్‌ సరికొత్త సిస్టమ్.. మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు..
Telangana Drug Alert System

Edited By:

Updated on: Mar 09, 2026 | 6:50 PM

ప్రజల ఆరోగ్య రక్షణకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక అడుగు వేసింది. నాణ్యత లేని (NSQ) మందుల గుర్తింపుపై రాష్ట్రవ్యాప్తంగా బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించనుంది. దీనితో మెడికల్ షాపులు, మాన్యుఫాక్చరర్లు, డిస్ట్రిబ్యూటర్లకు వెంటనే హెచ్చరికలు చేరనున్నాయి. రాష్ట్రంలో ఔషధ భద్రతను బలోపేతం చేయడానికి, నాసిరకం మందుల అమ్మకాలను నిరోధించడానికి, నాణ్యతా ప్రమాణాలు పాటించని మందుల గురించి ఫార్మసీలు, టోకు వ్యాపారులను హెచ్చరించడానికి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) సోమవారం (మార్చి 9, 2026) బల్క్ SMS అలర్ట్ సిస్టమ్‌ను ప్రారంభించింది.

ప్రస్తుతం CDSCO వెబ్‌సైట్ లేదా మంత్లీ సర్క్యులర్ల ద్వారా హెచ్చరికలు జారీ అవుతున్నాయి, ఇది 15-20 రోజుల ఆలస్యానికి కారణమవుతోంది. కొత్త వ్యవస్థలో NSQ మందులు గుర్తించగానే SMS, ఈమెయిల్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా అలర్ట్‌లు పంపబడతాయి. దీని వల్ల 48,000 మెడికల్ షాపులు, 760 మాన్యుఫాక్చరర్లు, హోల్‌సేలర్లకు ఒకేసారి సమాచారం చేరుతుంది. అలర్ట్ అందిన వెంటనే మందు విక్రయాలు ఆపేయాలని DCA డైరెక్టర్ జనరల్ షహ్నవాజ్‌ఖాన్ ఆదేశించారు.

ప్రజల ఆరోగ్య రక్షణకు డిజిటల్ పటిష్ఠం: నాణ్యత లేని మందుల విక్రయం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఫ్రీజ్ ఆర్డర్ తర్వాత విక్రయం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని డీజీ స్పష్టం చేశారు. ఆరోగ్య నిపుణులు ఈ వ్యవస్థను స్వాగతించారు. “రియల్‌టైమ్ ట్రాకింగ్‌తో అనర్హ మందులు ప్రజల చేతిలోకి చేరకుండా అడ్డుకోవచ్చు” అని డాక్టర్ జీ. శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.DCAకి ప్రస్తుతం ఒకే ల్యాబ్ ఉంది, సంవత్సరానికి 5-6 వేల సాంపిళ్లను పరీక్షిస్తోంది, లక్ష్యం 12 వేలు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండలో కొత్త ల్యాబ్‌లు, అదనపు ఇన్‌స్పెక్టర్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ చర్యలతో మందు సేఫ్టీ మరింత బలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us