MLA Komatireddy: మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆయన ఏదో సెన్సేషనల్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

MLA Komatireddy: మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతా.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Munugode Mla Komatireddy Rajagopal Reddy

Edited By:

Updated on: Feb 14, 2026 | 9:19 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆయన ఏదో సెన్సేషనల్ కామెంట్స్ తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రివర్గ వి4స్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అప్పటి నుంచి సీఎం రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిత్యం ఏదో విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతానని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆయన అన్నారు…నాకు పదవి అదే వస్తది… మంత్రి పదవినీ,.. నాకు అడుక్కోవడం రాదు…సమయం వస్తే లాక్కుంటానని అన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వండి, లేదంటే నేనే ముఖ్యమంత్రి పదవి కోసం కోట్లాడతానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. పైసలు, నిధులు అన్నీ మీకేనా అంటూ రేవంత్ రెడ్డిని గతంలో ఓసారి నిలదీశారు. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామే తప్ప కబ్జాలు చేయడానికి రాలేదు.. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రకాంగ్రెస్ లో తీవ్ర దుమారం లేపుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..