Telangana: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జూన్‌ 20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో

|

Jun 09, 2023 | 7:57 AM

తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో రాగిజావ అందించాలని నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు...

Telangana: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. జూన్‌ 20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో
Telangana Schools
Follow us on

తెలంగాణలో విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో రాగిజావ అందించాలని నిర్ణయించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న నిర్వహించే విద్యా దినోత్సవం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు టిఫిన్‌గా రాగిజావ అందించనున్నారు. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

గురువారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ పనితీరు, విద్యా దినోత్సవంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ ప్రేయర్‌ సమయానికి ముందే ప్రతి విద్యార్థికి 250 మిల్లీలీటర్ల రాగిజావ అందిస్తామని తెలిపారు. దీనివల్ల 28,606 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,26,907 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న 16,27,457 మంది విద్యార్థులకు మూడేసి చొప్పున వర్క్‌బుక్స్‌, ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న 12,39,415 మంది విద్యార్థులకు సబ్జెక్టుకు ఒకో నోటు పుస్తకం చొప్పున అందిస్తామని మంత్రి తెలిపారు.1,600 పాఠశాలల్లో నిర్మించిన 4,800 డిజిటల్‌ తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందిచనున్నట్టు పేర్కొన్నారు. 26 లక్షల మంది విద్యార్థులకు రెండేసి జతల యూనిఫామ్‌లను అందిస్తామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..