Watch: తహసీల్దార్ ఆఫీస్ తనిఖీకి వెళ్లిన మంత్రి.. టాయిలెట్ దుస్థితి చూసి చేసిన పని ఇదే!
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని అపరిశుభ్ర టాయిలెట్‌ను చూసి అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, సిబ్బందిని మందలించి స్వయంగా శుభ్రం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత ఎంత ముఖ్యమో అధికారులకు గుర్తుచేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం (ఆగస్టు 21)ఆకస్మిక తనిఖీకి వచ్చిన తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తహసీల్దార్ కార్యాలయంలోని వాష్‌రూమ్‌ను పరిశీలించారు. అది తీవ్ర అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి.. స్వయంగా నీళ్లు చల్లి టాయిలెట్‌ను శుభ్రం చేశారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయం ఇలా అపరిశుభ్రంగా ఉంటే ఎలా అంటూ ప్రశ్నించారు. మంత్రి స్వయంగా టాయిలెట్ శుభ్రం చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..