Coronavirus: తెలంగాణలో పాఠశాలల మూసివేతకు వైద్యశాఖ ప్రతిపాదన.. రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం

coroCoronavirus: ఏడాదిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడు జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. దేశ..

Coronavirus: తెలంగాణలో పాఠశాలల మూసివేతకు వైద్యశాఖ ప్రతిపాదన.. రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం
Telangana Schools
Follow us

|

Updated on: Mar 23, 2021 | 6:43 AM

coroCoronavirus: ఏడాదిగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడు జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా పడగ విప్పుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసృతి గృహాలను వెంటనే మూసివేస్తే మేలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకున్నాక.. ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు అంచనా. పిల్లల్లో రోగనిరోధక శక్తి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. వీటిలో పాజిటివ్‌ లక్షణాలు బయటకు కనిపించవు. అందు వల్ల మీరు తరగతులకు హాజరై ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ప్రజలకు, కుటుంబ సభ్యులకు కరోనా వ్యాపించడానికి కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే ఈ నెలారంభం నుంచి నానాటికి కరోనా కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు.

2020 సెప్టెంబర్‌ నుంచి గత నెలాఖరు వరకు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్దగా లేవు. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నాయి. అక్కడి నుంచి నిత్యం వేలాది మంది తెలంగాణకు రాకపోకలు సాగిస్తుంటారు. వారి నుంచి వైరస్‌ తెలంగాణలోకి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యశాఖ భావిస్తోంది. ఇక్కడి విద్యార్థులల్లోనూ కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు మూసివేయడం ఉత్తమమని వైద్యశాఖ చెబుతోంది.

కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 300 వరకు పాజిటివ్‌ కేసులు నమోదువుతుండటంతో వీరికి సోకింది కరోనా సెకండ్‌ వేవ్‌ స్ట్రెయినేనా అని వైద్యులు అనుమానిస్తున్నారు. ఏ రకమో నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. అది తేలితే నియంత్రణపై ఒక అంచనాకు వచ్చే అవకాశముంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్నా..తెలంగాణలోకి ఇంకా రాలేదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గత పది రోజులుగా పరిస్థితులను చూస్తుంటే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయాందోళన చెందకుండా టీకా వేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

ఇవీ చదవండి :

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్ అప్డేట్ ఇదే.. హోంమంత్రి, హెల్త్ డైరెక్టర్ ఏమన్నారంటే..?

AP Corona Second Wave : ఏపీలో మళ్లీ మొదలైన కరోనా విజృంభణ, పలు ఆలయాల్లో అన్నదానం నిలిపివేత

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు