Weather Report: చురుగ్గా కదులుతోన్న నైరుతి.. వచ్చే మూడు రోజులు కూల్.. కూల్..!

మండే ఎండల నుంచి కాస్త రిలీఫ్ దొరకనుంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో..

Weather Report: చురుగ్గా కదులుతోన్న నైరుతి.. వచ్చే మూడు రోజులు కూల్.. కూల్..!
Weather Report

Updated on: May 18, 2025 | 7:01 AM

హైదరాబాద్, మే 18: దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు సగటు సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.

ఈ రోజు (మే 18) తెలంగాణలోని కొమరంభీం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఆదివారం నాడు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

నేడు రాష్ట్ర ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే..

ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్‌లో 37.8, కనిష్టంగా హైదరాబాద్‌లో 34.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మే 17న ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, హనుమకొండ లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏ జిల్లాలో ఎంతెంత ఉందంటే..

ఇవి కూడా చదవండి
  • ఆదిలాబాద్.. 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత
  • నిజామాబాద్.. 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత
  • రామగుండం.. 39.6 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హనుమకొండ.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత
  • నల్లగొండ.. 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత
  • ఖమ్మం.. 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత
  • మెదక్.. 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత
  • మహబూబ్ నగర్.. 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత
  • హైదరాబాద్.. 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత
  • భద్రాచలం.. 33.2 డిగ్రీల ఉష్ణోగ్రతల చొప్పున నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us