Chemical Blast: హైదరాబాద్‌ అఫ్జల్ గంజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఇంకొకరికి గాయాలు..

హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు కలకలం రేపింది. అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని గౌలిగూడ మసీదు వెనుక బస్తీలో కెమికల్ బ్లాస్ట్‌ తీవ్ర భయాందోళన రేపింది. గౌలిగౌడలో సంభవించిన పేలుడు ధాటికి

Chemical Blast: హైదరాబాద్‌ అఫ్జల్ గంజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, ఇంకొకరికి గాయాలు..
Chemical Blast

Updated on: Jun 12, 2022 | 6:06 PM

హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ పేలుడు కలకలం రేపింది. అఫ్జల్‌గంజ్‌ పరిధిలోని గౌలిగూడ మసీదు వెనుక బస్తీలో కెమికల్ బ్లాస్ట్‌ తీవ్ర భయాందోళన రేపింది. గౌలిగౌడలో సంభవించిన పేలుడు ధాటికి ఒకరు మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. రసాయనాలను నాలాలో పోస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టుగా తెలిసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

భరత్‌(32) అనే వ్యక్తి కెమికల్స్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే కాలం చెల్లిన కెమికల్స్‌ను ఇంటి ఎదుట ఉన్న నాలాలో పారబోస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం కూడా అలాగే నాలాలో పారపోశాడు. ఆ తర్వాత నాలాలో ఇనుప చువ్వ సాయంతో రసాయనాలను కదిలించాడు. దాంతో ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భరత్‌ ఎగిరిపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతిడితో పాటు మరో వ్యక్తికి గాయాలైనట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

ఇవి కూడా చదవండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us