ప్రేమంటే ఇదేరా..! తాతకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్న మనవడు.. ఎక్కడో తెలుసా..

|

Mar 16, 2021 | 9:37 PM

కన్నవారికి గుడి కట్టి పూజిస్తున్న సంఘటనలు మనం చూసాం. ఇక అభిమానం ముదిరి హీరోలకు హీరోయిన్లకు గుళ్ళు కట్టినోళ్లను కూడా చూస్తున్నాం. ఇటీవలే హీరోయిన్ నిధిఅగార్వల్ కు కుడికట్టారు కొందరు

ప్రేమంటే ఇదేరా..! తాతకు గుడి కట్టి నిత్యం పూజలు చేస్తున్న మనవడు.. ఎక్కడో తెలుసా..
Temple
Follow us on

man builds temple for his grandfather : కన్నవారికి గుడి కట్టి పూజిస్తున్న సంఘటనలు మనం చూసాం. ఇక అభిమానం ముదిరి హీరోలకు హీరోయిన్లకు గుళ్ళు కట్టినోళ్లను కూడా చూస్తున్నాం. ఇటీవలే హీరోయిన్ నిధిఅగార్వల్ కు కుడికట్టారు కొందరు డై హార్డ్ ఫ్యాన్స్ ఇదిలా ఉంటే ఇప్పుడు దేశంలోనే అరుదైన ఆలయం ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్‌ జిల్లాలో ఉంది ఈ ఆశ్చర్యపరిచే దేవాలయం..ఈ గుడిలో కొలువైన దేవుడు ఓ పెద్దాయన..పూజారి, భక్తుడు ఆ పెద్దాయన మనవడు..అంటే ఇతడు తన తాతకు గుడికట్టి పూజిస్తున్నాడన్నమాట. ఈ గుడిలోని దేవుడి ప్లేస్లో  ఉన్న వ్యక్తి పేరు..మొగులప్ప. బషీరాబాద్‌ మండలం నావల్గ గ్రామానికి చెందిన మొగులప్పకు సంతానం లేకపోవడంతో తన కొడుకు మనవడు… ఈశ్వర్‌ను దత్తత తీసుకుని పెంచి పెద్ద చేశాడు. దత్తత వల్ల తండ్రయినప్పటికీ.. వరుసకు పెదతాత అయిన మొగులప్పను ఈశ్వర్‌ ఎప్పుడూ తాత అంటూ ప్రేమతో పిలిచేవాడు.

2013లో మొగులప్ప అనారోగ్యం కారణంగా మరణించాడు.. దాంతో ఈశ్వర్ ఒంటరివాడైపోయాడు.  మానసికంగా కుంగిపోయాడు. తన తాతను ఎప్పటికీ స్మరించుకునేలా తన సొంత భూమిలో 24 లక్షలు వెచ్చించి భవ్య ఆలయం నిర్మించాడు. వ్యవసాయం చేసే ఈశ్వర్‌ నిత్యం తన తాతకు పూజ చేసిన తర్వాతే ఏ పని అయినా మొదలుపెట్టడం ఆనవాయితీగా చేసుకున్నాడు. మొగులప్ప వర్ధంతి రోజున ఆరాధనోత్సవాలు కూడా నిర్వహిస్తుంటాడు. ఇలా తన తాతపైనా ప్రేమ చుపుతున్న ఈశ్వర్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hyderabad Water Supply Alert : హైదరాబాద్ లో మంచినీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే.

Bhainsa ASP Kiran : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. బైంసా ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ నియామకం..

Covid-19 again : నాగోల్ బాలికల హాస్టళ్లో 38 మందికి, కామారెడ్డి జిల్లా స్కూళ్లో 31 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్