Lok Sabha Election 2024: సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. అసలేం జరిగిందంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీకి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీకి ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. ఓటు వేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనల కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిపై ఈసీకి రఘునందన్ ఫిర్యాదు చేశారు. కొడంగల్‌లో సీఎం ప్రెస్‌మీట్ పెట్టి మోదీ, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలంటూ రఘునందన్ కోరారు.
కాగా.. ఓటు వేసేందుకు కుటుంబసభ్యులతో కొడంగల్‌కు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. జిల్లా పరిషత్ స్కూలులోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఇదిలాఉంటే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ సైతం ఫిర్యాదు చేసింది. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు కేసు నమోదు చేయాలంటూ సీఈఓ వికాస్ రాజ్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది.. ఆ తర్వాత బీజేపీ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది.
కఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..