Telangana Lockdown: తెలంగాణ‌లో రేప‌ట్నుంచే లాక్ డౌన్.. తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

|

May 11, 2021 | 3:01 PM

తెలంగాణ‌లో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్.....

Telangana Lockdown: తెలంగాణ‌లో  రేప‌ట్నుంచే లాక్ డౌన్..  తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
Telangana Lockdown
Follow us on

తెలంగాణ‌లో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని.. ఆ త‌ర్వాత రాష్ట్రం లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్ల‌నుంది. మ‌రోవైపు
టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు ఈ సమయంలో వెసులుబాటు కల్పించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించనున్నారు.

తెలంగాణ స‌ర్కార్ ఇప్ప‌టికే రాత్రి పూట క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తోంది. అయినప్ప‌టికీ వైర‌స్ వ్యాప్తి అదుపులోకి రాలేదు. భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఆందోళ‌నక‌రంగా ఉంది. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం క్యాబినెట్ లో చ‌ర్చించి.. లాక్ డౌన్ విధిస్తున్న‌ట్లు తెలిపింది.

Also Read: ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు ఈ ప్లేయర్స్ దూరం..! ఎందుకో తెలుసుకోండి..?

తిరుపతిలో ఘోరం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి