Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్..

కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి రాష్ట్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు.

Congress: తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్..
Ktr
Follow us
Srikar T

|

Updated on: Feb 11, 2024 | 12:39 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వ తొలి రాష్ట్ర బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫార్మా సిటీ, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుల రద్దుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇవి హైదరాబాద్ ప్రగతికి ముఖ్యమైన ప్రాజెక్టులు. అయితే, ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలనే ఇటీవలి నిర్ణయం రాష్ట్ర ఆదాయంలో క్షీణతకు దారి తీస్తుంది ”అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని, పురోగతిని అడ్డుకుంటున్నదని ఆరోపించారు. “అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా దృష్టి పెట్టారన్నారు. ఈ ప్రయత్నాలను ప్రజలు ఇకపై నమ్మరు” అని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ జనరల్‌బాడీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో పాటు రోజువారీ కార్యకలాపాల్లో జీహెచ్‌ఎంసీ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలందించేందుకు పాలకమండలి, ఎన్నికైన కార్పొరేటర్లు తమ అధికారాలను వినియోగించుకోవాలని కోరారు. “జీహెచ్ఎంసీ అనేది రాజ్యాంగం ద్వారా స్థాపించబడిన ఐదు అంచెల పరిపాలన వ్యవస్థలో భాగంగా ఏర్పడిన స్థానిక ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలి” అని కార్పొరేటర్లకు దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం స్థానంలో కొత్త చిహ్నాన్నిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కేటీఆర్ తప్పుబట్టారు . “కాంగ్రెస్ టీఎస్‌ని టీజీగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అలాగే కాకతీయ శిలాతోరణం, చార్మినార్ తో ఉండే లోగోను తొలగించాలని చూస్తున్నట్లు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుంచి హైదరాబాద్ కు ఎవరు వచ్చినా ముందుగా చార్మినార్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారన్నారు. అలాంటి ప్రత్యేకత కలిగిన చిహ్నాన్ని తీసివేయడంపై చురకలు అంటించారు. గోల్కొండ కోట నవాబుల వైభవంగా కీర్తిస్తూ, కాకతీయ రాజ్యాన్ని కీర్తిస్తూ కవి అందెశ్రీ రాసిన ‘ జయ జయ హే తెలంగాణ ‘ పాటను రాష్ట్ర గీతంగా మార్చడంలో రేవంత్ ‘వ్యంగ్యం’ ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..