నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ

కొండా సురేఖ చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పలువురు మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని, మంత్రుల పై ఆరోపణలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ
Konda Surekha Comments On Cm Revanth Reddy

Updated on: Sep 02, 2026 | 3:40 PM

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలని ఇప్పటి వరకు ఎవరూ తనను కోరలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నేతలపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని బాంబు పేల్చారు.

బీసీని అయిన తన విషయంలో ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాల విషయంలో మరో న్యాయం ఎందుకని సురేఖ ప్రశ్నించారు. బీసీ సామాజికవర్గానికి ఒక విధంగా, ఇతర సామాజికవర్గాలకు మరో విధంగా వ్యవహరించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పలువురు మంత్రులపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని కొండా సురేఖ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాటికి ఏం సమాధానం చెబుతారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటూ ఆమె ప్రశ్నించారు. తనకు సంబంధించిన అంశాలపై అధిష్ఠానానికి ఇప్పటికే అన్నింటినీ రాతపూర్వకంగా తెలియజేశానని కొండా సురేఖ పేర్కొన్నారు.

వీడియో చూడండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us