తండ్రి ఆఖరి కోరిక కోసం.. కన్నీళ్లను దిగమింగి తలకొరివి పెట్టిన చిన్నారి!

తండ్రి ఆఖరి కోరికను నెరవేర్చేందుకు చిన్నారి బిందుశ్రీ కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆయన చితికి నిప్పంటించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి .. .. ..

తండ్రి ఆఖరి కోరిక కోసం.. కన్నీళ్లను దిగమింగి తలకొరివి పెట్టిన చిన్నారి!
Girl Performs Father's Last Rites

Edited By:

Updated on: Oct 21, 2026 | 7:06 PM

తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు ఆ చిన్నారి గుండె నిబ్బరం చేసుకుంది. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుంటూ తండ్రి చితికి నిప్పంటించింది. తండ్రిని కడసారి సాగనంపుతూ ఆ చిన్నారి చేసిన పని అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన అందరినీ కలచివేసింది.

పెనుబల్లి గ్రామానికి చెందిన వంగా వంశీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయదశమి పండుగ రోజున రాత్రి తుదిశ్వాస విడిచారు. పండుగ వేళ ఆ ఇంట్లో తీరని విషాదం అలుముకుంది. కుటుంబానికి అండగా నిలిచిన తండ్రి ఇక లేరనే నిజాన్ని ఆ చిన్నారులు జీర్ణించుకోలేకపోయారు.

అయితే, తాను మరణించిన తర్వాత తన పెద్ద కుమార్తె బిందుశ్రీయే తనకు తలకొరివి పెట్టాలని వంశీ బతికున్నప్పుడే తన చివరి కోరికను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తండ్రి మనసులోని ఆ కోరికను గౌరవించిన కుటుంబ సభ్యులు, బంధువులు బిందుశ్రీ చేతుల మీదుగానే అంత్యక్రియలు నిర్వహించారు.

తండ్రిని కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బిందుశ్రీ.. చివరకు తండ్రి చితికి నిప్పంటించి కడసారి వీడ్కోలు పలికింది. తండ్రి ఇక తిరిగిరాడనే చేదు నిజాన్ని తట్టుకుంటూ, ఆయన చివరి కోరికను నెరవేర్చిన ఆ చిన్నారిని చూసి అక్కడున్నవారి కళ్లు చెమ్మగిల్లాయి.

తండ్రికి వీడ్కోలు పలికిన ఆ చిన్నారి చేతులు.. ఆయన చివరి కోరికను నెరవేర్చాయి. కానీ ఆ చిన్నారి జీవితంలో తండ్రి లేని లోటును ఎవరు తీర్చగలరు? వంగా వంశీ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు కుమార్తెలకు మనోధైర్యం కలగాలని స్థానికులు కోరుకుంటున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us