Watch: ప్రభుత్వ కార్యాలయంలోకి తాచుపాము ఎంట్రీ.. కిటికీలోంచి వచ్చి సిబ్బందిని పరుగులు పెట్టించింది!

Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ తహసీల్దార్ కార్యాలయంలోకి తాచుపాము ప్రవేశించి సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కిటికీల గుండా లోపలికి వచ్చిన పాము గంటకు పైగా కలకలం సృష్టించింది. ప్రాణ భయంతో వణికిపోయిన సిబ్బంది, స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించగా, అతను పామును సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలివేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Watch: ప్రభుత్వ కార్యాలయంలోకి తాచుపాము ఎంట్రీ.. కిటికీలోంచి వచ్చి సిబ్బందిని పరుగులు పెట్టించింది!
Cobra Panic In Tehsildar Office

Edited By:

Updated on: Nov 03, 2026 | 5:08 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఓ కార్యాలయంలో తాచుపాము హల్చల్ చేసింది. కిటికీల నుంచి కార్యాలయంలో లోపలికి ప్రవేశించిన పాము సిబ్బందిని పరుగులు పెట్టించింది. ప్రాణ భయంతో వణికిపోయిన ఆ కార్యాలయం సిబ్బంది.. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మహదేవపూర్ తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. కిటికీల నుంచి పాము తహసీల్దార్ కార్యాలయంలోకి చొరబడింది. కార్యాలయంలో సుమారు గంటకు పైగా పాము కలకలం సృష్టించింది. విధుల్లో నిమగ్నమై ఉన్న సిబ్బందికి పాము కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు పెట్టారు. పాము హల్చల్ చేయడంతో కొంతసేపు తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వెంటనే స్నేక్ క్యాచర్‌‌కు సమాచారం అందించడంతో ఆయన కార్యాలయానికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పామును సంచిలో బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us