Jangaon News: జనగామ జిల్లాలో టెన్షన్ పరిస్థితి నెలకొంది. అక్కడ రాత్రైతే చాలు జనాలు భయంతో వణికిపోతున్నారు. నిద్రపోవాలన్నా జంకుతున్నారు. ప్రజలంతా రాత్రుళ్లు నిద్రమాని మరీ కాపలా కూర్చుకుంటున్నారు. మరి ప్రజలను అంతలా భయపడెతున్నదేంటి? ఎందుకంత వణికిపోతున్నారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. జనగామ జిల్లాలో హైనాలు హల్‌చల్ చేస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు గ్రామాల్లోకి చొరబడి అలజడి సృష్టిస్తున్నాయి. హైనాల భయంతో ప్రజలు రాత్రుళ్లు నిద్రమాని కాపలా కూర్చుంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో హైనాలు హైరానా పెట్టాయి. గ్రామ శివారున గల కోళ్లఫారాం సమీపంలో అరుపులతో అలజడి రేపాయి. గ్రామానికి చెందిన వర్షిణి, వినయ్ కుమార్‌లు రాత్రిళ్ళు కోళ్ళకు దాన వేసేందుకు వెళ్లి అక్కడ ఉంటారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి అరుపులతో అలజడి రేపగా పెద్ద పులులేమో అని బయపడి చూశారు. తమ సెల్ ఫోన్‌లో వీడియోలు, ఆడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియో, ఆడియో రికార్డులను చూపుతూ స్థానికులు, అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. ఆ వీడియోలో, ఆడియోలను బట్టి అవి హైనాలు అని తేల్చారు అటవీశాఖ అధికారులు. అప్పటి నుంచి రోజూ రాత్రి హైనాలు ఊర్లోకి చొరబడుతున్నాయి. హైనాల రాకతో జనాలు భయపడిపోతున్నారు. క్రూర జంతువులైన హైనాలు.. ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. హైనాల నుంచి తమను కాపాడాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
Also read:
Hyderabad News: అమ్మకు ప్రేమతో కొడుకు చేసిన గొప్పపని.. చూస్తే వావ్ అంటారు..!
Union Bank: యూనియన్ బ్యాంకుకు రూ.1085 కోట్ల లాభం..!
Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…