Hyderabad: వర్షం పడుతున్నా ఎండలు, ఉక్కపోత.. సెప్టెంబర్‌లోనే సమ్మర్ ఫీల్.. అక్టోబర్‌లో హైదరాబాద్ పరిస్థితి ఏంటి..?

హైదరాబాద్ వాసులకు విచిత్రమైన వాతావరణ అనుభవం ఎదురవుతోంది. ఆకాశం చూస్తే వర్షాకాలం.. బయటకు వస్తే మాత్రం మండుటెండ, దడపుట్టించే ఉక్కపోత.. సాధారణంగా సెప్టెంబర్ చివర్లో ఉష్ణోగ్రతలు తగ్గాలి.. కానీ భాగ్యనగరంలో గాలిలో తేమ ఏకంగా 90 శాతానికి పైగా నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వర్షం పడినా ఎందుకు చల్లబడటం లేదు? అసలు ఈ హీట్ ఇండెక్స్ లెక్కలేంటి? రాబోయే అక్టోబర్‌లో వాతావరణం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం..

Hyderabad: వర్షం పడుతున్నా ఎండలు, ఉక్కపోత.. సెప్టెంబర్‌లోనే సమ్మర్ ఫీల్.. అక్టోబర్‌లో హైదరాబాద్ పరిస్థితి ఏంటి..?
High Humidity In Hyderabad
Image Credit source: AI Image

Edited By:

Updated on: Sep 23, 2026 | 9:52 PM

హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ నెలకు దీర్ఘకాలిక సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు 31.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.3 డిగ్రీలు. అక్టోబర్‌లో సగటు గరిష్ఠం 31 డిగ్రీలు, కనిష్ఠం 20.6 డిగ్రీలు. అంటే సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం సాధారణం. కానీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పలు రోజులు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సెప్టెంబర్ 23న హైదరాబాద్‌లో 21.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే రోజు ఉదయం 8.30 గంటలకు గాలిలో తేమ ఏకంగా 91 శాతంగా ఉంది. రాబోయే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. అంటే వర్షం పడుతున్నా.. వేడి, తేమ మాత్రం నగరాన్ని వదలడం లేదు. 32 డిగ్రీలు.. కానీ ఇంకా ఎక్కువగా అనిపిస్తోంది. ఇక్కడ అసలు కథ ఉష్ణోగ్రత ఒక్కటే కాదు. తేమ కూడా కీలకమే. గాలిలో తేమ 80 నుంచి 90 శాతానికి చేరితే శరీరంలోని చెమట త్వరగా ఆవిరి కాదు. దాంతో శరీరం సహజంగా వేడిని బయటకు పంపుకోలేకపోతుంది. ఫలితంగా థర్మామీటర్‌పై 31 లేదా 32 డిగ్రీలు కనిపించినా.. మనకు అంతకంటే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది. దీనినే సాధారణంగా హీట్ ఇండెక్స్ లేదా ఫీల్ లైక్ టెంపరేచర్ ప్రభావంగా చూడొచ్చు. అందుకే హైదరాబాద్‌లో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితిని కేవలం ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పడం...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి