తెలంగాణలో టార్గెట్‌ డబుల్‌ డిజిట్‌.! ఎంపీ ఎన్నికల్లో ఎవరివ్యూహం వారిదే.. ఎవరి ధీమా వారిదే!

తెలంగాణలో పార్లమెంట్‌ పోరు.. పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే అసెంబ్లీ గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. అదే జోష్‌ని కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఓట్లు, సీట్లు రెండింటినీ పెంచుకుని హుషారుగా ఉన్న కమలదళం కూడా.. ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయి..

Follow us

|

Updated on: Apr 13, 2024 | 7:31 PM

తెలంగాణలో పార్లమెంట్‌ పోరు.. పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పటికే అసెంబ్లీ గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్‌.. అదే జోష్‌ని కంటిన్యూ చేయాలనుకుంటోంది. ఓట్లు, సీట్లు రెండింటినీ పెంచుకుని హుషారుగా ఉన్న కమలదళం కూడా.. ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్న బీఆర్‌ఎస్‌ కూడా.. ఢిల్లీ లెవెల్‌లో గల్లీ వాయిస్‌ వినిస్తామంటోంది. ప్రత్యర్థులపై సమరశంఖం పూరిస్తోంది. అందరి టార్గెట్‌ డబుల్‌ డిజిట్టే.. మరి ఆ టార్గెట్‌ను రీచ్‌ అయ్యేదెవరు? ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది.

సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. తెలంగాణలో రాజకీయం అంతకంతకూ వేడెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌.. డబుల్‌ డిజిట్‌ సాధించేందుకు దేనికవే వ్యూహప్రతివ్యూహాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. తుక్కుగూడ సభతో ఇప్పటికే జంగ్‌ సైరన్‌ మోగించింది. 14 ఎంపీ సీట్లే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే సీఎం రేవంత్‌ క్యాడర్‌కు పిలుపునివ్వగా.. 12 ఎంపీ స్థానాలు కచ్చితంగా గెలిచి తీరుతామంటున్నారు మంత్రి శ్రీధర్‌బాబు. గతంతో పోలిస్తే ఓట్లు, సీట్ల పరంగా తెలంగాణలో బాగా మెరుగుపడిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ కొట్టాల్సిందే అంటోంది. 12 ఎంపీ స్థానాల్లో గెలిచి తీరుతామంటున్నారు కమలనాథులు. ఇండియన్‌ పొలిటికల్‌లీగ్‌లో బీజేపీదే విజయమంటున్న బండి సంజయ్‌… తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను డకౌట్‌ చేస్తామంటున్నారు.

బీఆర్‌ఎస్‌ కూడా తగ్గేదేలె అంటోంది.. అసెంబ్లీ ఓటమిని లెక్కచేయకుండా జాతీయ పార్టీలకు ధీటుగా పార్లమెంటుకు సిద్ధమంటోంది. చేవెళ్లలో ఎన్నికల శంఖారావం పూరించి.. సమరానికి సై అంటోంది. 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అయితే, ఒక్కసారిగా జోష్‌లోకి వచ్చిన కాంగ్రెస్‌, బీజేపీలు.. కారు పార్టీకి సైడిస్తాయా? అన్నదే పొలిటికల్‌గా చర్చనీయంశమవుతోంది. బలంగా మారిన జాతీయ పార్టీలను తట్టుకుని.. బీఆర్‌ఎస్‌ మళ్లీ పుంజుకుంకుంటుందా? చేవెళ్ల శంఖారావంతో పడిలేచిన కెరటంలా ఎగిసిపడుతుందా? చూడాలి.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ