Singer Chinmayi: చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ స్టార్ యాంకర్ ను ఏకిపారేసిన సింగర్ చిన్మయి

టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సమంతకు డబ్బింగ్ చెప్పడంతో పాటు కొన్ని పాటలు కూడా పాడింది చిన్మయి. అదే సమయంలో మీటూ ఉద్యమం గురించి శాయశక్తులా పోరాడుతోంది. వైరముత్తు లాంటి దిగ్గజాలపై సంచలన ఆరోపణలు చేయడంతో..

Singer Chinmayi: చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ స్టార్ యాంకర్ ను ఏకిపారేసిన సింగర్ చిన్మయి
Singer Chinmayi
Follow us

|

Updated on: Jul 27, 2024 | 9:04 PM

టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సమంతకు డబ్బింగ్ చెప్పడంతో పాటు కొన్ని పాటలు కూడా పాడింది చిన్మయి. అదే సమయంలో మీటూ ఉద్యమం గురించి శాయశక్తులా పోరాడుతోంది. వైరముత్తు లాంటి దిగ్గజాలపై సంచలన ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసింది. దీంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోందీ బ్యూటీఫుల్ సింగర్. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాలపై గళ మెత్తుతోంది. ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయట పెట్టిన చిన్మయి తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. ఒక టీవీ షోలో ఒక ప్రముఖ యాంకర్ చిన్న పిల్లలతో ముద్దులు పెట్టించుకోవడంపై ఆమె మండిపడింది. సదరు టీవీషో, ఆ స్టార్ యాంకర్ పేరు ఎత్తకుండానే చిన్న పిల్లలతో ఇలాంటి పనులేంటి? ఇది వినోదమా? అంటూ మండి పడింది. ‘ఒక ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్, పేరెంట్స్ తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని సంశయంలో పడతాడు’

పిల్లల మీద, పిల్లలతో ఈ టీవీల్లో చేసే షోలు చాలా భయంకరంగా ఉంటున్నాయి.. ఇది ఎప్పటికీ కూడా ఫన్ అనిపించుకోదు. చిన్నారుల భద్రతకు ఇవి ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన సుదీర్ఘమైన నోట్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా వెలిగి ప్రస్తుతం వెండితెరపై మెరుస్తోన్న ఒక నటి గురించే చిన్మయి ఈ పోస్ట పెట్టిందని నెటిజన్లు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సింగర్ చిన్మయి పోస్ట్..

విజయ్ జాన్ పై సంచలన ఆరోపణలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
భారత ఒలింపిక్స్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు