Telangana Assembly: హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే.. అసెంబ్లీలో వార్.. సవాల్..

తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. కూడబెట్టిన ఆస్తుల గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకున్న ఆస్తుల లెక్కలు ఎందుకు చెప్పడం లేదని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి..

Telangana Assembly: హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే.. అసెంబ్లీలో వార్.. సవాల్..
Harish Rao Vs Cm Revanth Reddy
Follow us

|

Updated on: Jul 27, 2024 | 7:06 PM

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాజీమంత్రి హరీష్‌రావు, సీఎం రేవంత్‌ రెడ్డి మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు పదేపదే కేసీఆర్ హయంలో రూ.7 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. రూ.7 లక్షల కోట్ల అప్పులలో కొన్ని చెల్లించినవి కొన్ని చెల్లించనివి ఉన్నాయన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటే తాము చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లకు పైగా మాత్రమే ఉంటుందన్నారు. తాము చేసిన అప్పుల గురించి చెబుతున్న కాంగ్రెస్ నేతలు తాము కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు, దేవాదుల, సమ్మక్క బ్యారేజీ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్, సుందిళ్ల భక్తరామదాసు ప్రాజెక్టు.. ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరు ఇచ్చామన్నారు. ఇదంతా తాము తయారు చేసిన ఆస్తులు కాదా? అని ప్రశ్నించారు. రైతు వేదికలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇలా ఎన్నో నిర్మించామన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

అమ్ముకున్న ఆస్తుల లెక్కలు చెప్పడం లేదన్న సీఎం రేవంత్..

అయితే హరీష్‌రావు చెప్పిన అంశాలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల లెక్క చెప్పే సమయంలో అమ్ముకున్న ఆస్తుల లెక్కలు ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ నిలదీశారు. ప్రాజెక్టులు కట్టినందుకు అప్పులు అయ్యాయని చెబుతున్న హరీష్‌రావు.. భూములు అమ్మిన విషయం ఎందుకు చెప్పలేదన్నారు. లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారని ఆరోపించారు. రూ.700 కోట్ల గొర్రెల పంపిణీలో భారీ అక్రమాలు జరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇటీవల రూ. 80 వేల కోట్లు ఖర్చు చేశామన్న బీఆర్ఎస్… ఇప్పుడు రూ.94 వేల కోట్లు అంటోందని విమర్శించారు. ఇలాంటి అబద్ధాలు చెబితేనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని, లోక్ సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజాయతీగా పాలన చేసి ఉంటే… బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ మీద విచారణకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

మరోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ బడ్జెట్‌లకు ఎటువంటి తేడా లేదని.. రెండు ప్రభుత్వాలు విలువైన భూములను అమ్మేందుకు సిద్ధం అయ్యాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్‌ చేసిన పొరపాట్లనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే..
హరీష్‌రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి.. తగ్గేదేలే..
బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే
బడ్జెట్ ఎఫెక్ట్.. దిగొచ్చిన ఐఫోన్ ధరలు.. ఇక అందరికీ అందుబాటులోనే
బొగత జలపాతాలకు నో ఎంట్రీ.! ఎవరూ రావద్దని ఆంక్షలు..
బొగత జలపాతాలకు నో ఎంట్రీ.! ఎవరూ రావద్దని ఆంక్షలు..
మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
మీ పీఎఫ్ విత్‌డ్రా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందా.?అసలు కారణం ఏంటంటే?
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
ఈ తీగలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!