Minister KTR: తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న ప్రపంచ దిగ్గజ సంస్థ.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..

గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది.

Minister KTR: తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న ప్రపంచ దిగ్గజ సంస్థ.. మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..
Minister Ktr

Updated on: May 18, 2023 | 7:09 AM

మీడియా, వినోద రంగానికి చెందిన ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణలో పెట్టుబడి పెట్టబోతుంది. హెచ్.బి.ఓ (HBO), హెచ్.బి.ఓ మ్యాక్స్, సిఎన్ఎన్, టి.ఎల్.సి, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్లుబి (WB), యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, హెచ్.జి.టీవీ (HGTV) తో పాటు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెలివిజన్, ఫిల్మ్, స్ట్రీమింగ్, కంటెంట్ బ్రాండ్‌లు, ఫ్రాంచైజీ లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు చెందినవే. గేమింగ్,స్ట్రీమింగ్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ రంగంలో భారత మార్కెట్ లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటుచేసేందుకు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ముందుకొచ్చింది. ఈ మేరకు తమ విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ తో చర్చించింది.

ప్రస్తుతం న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనిలో భాగంగా వార్నర్ బ్రదర్స్ డిస్కవ‌రీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో వారు సూధీర్ఘంగా చర్చించారు. ఇండియాలో తమ మార్కెట్‌ను సుస్థిరం చేసుకునే లక్ష్యంతో డెవలప్‌మెంట్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని అలెగ్జాండ్రా కార్టర్ తెలిపారు. మొదటి సంవత్సరం 1200 మందికి ఉపాధి కల్పిస్తామమని, వ్యాపారం పెరిగేకొద్ది మరింతమందికి అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణ వినోద రంగంలోకి డిస్కవరీ రావ‌డం సంతోష‌క‌రమన్నారు. క్రియేటివిటీ, ఇన్నోవేష‌న్ హ‌బ్‌గా ఐడీసీ (అంత‌ర్జాతీయ అభివృద్ధి కేంద్రం) ని డిస్కవరీ ఏర్పాటు చేస్తోందని.. మొద‌టి ఏడాదిలోనే 1200 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని కేటీఆర్ తెలిపారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థకు ప్రభుత్వం తరుపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us