Hyderabad: కుక్క నోట బాలుడి తల.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే..?

Boy's head found at Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని బాలుడి తల నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. బాలుడి తలను కుక్క

Hyderabad: కుక్క నోట బాలుడి తల.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అసలేమైందంటే..?
Hyderabad
Follow us

|

Updated on: Mar 13, 2022 | 6:00 PM

Boy’s head found at Hyderabad: హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని బాలుడి తల నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని తీసుకెళ్తుండగా చూసి స్థానికులు గుర్తించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్యాడ్, క్లూస్ టీంను రంగలోకి దింపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నగరంలోని ఎల్బీనగర్‌కు చెందిన కార్తీక్‌.. ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో ఓ పాల దుకాణంలో కూర్చుని ఉన్నాడు. ఈ క్రమంలో బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా.. తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి పారిపోయింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్1 దగ్గర జరిగింది.

బాలుడి తలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు. శిశువు తలను కుక్క ఎక్కడ నుంచి తెచ్చింది అనే విషయంపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read:

Viral Video: గజరాజుకు కోపం వస్తే మృగరాజైనా తొకముడవాల్సిందే..! సింహాలకే సుస్సు పొయించిన ఏనుగు.. షాకింగ్ వీడియో

Warangal: మనవడిని కాపాడబోయి తాత.. ఆ తర్వాత తండ్రి.. మూడు తరాల బంధాన్ని మింగిన చెరువు..