Telangana: కి’లేడీ’ వలపు వలలు.. నగ్న వీడియోలతో కవ్వింపులు.. ఆపై బెదిరింపులు.. కట్ చేస్తే..

|

Feb 17, 2023 | 2:01 PM

న్యూడ్ వీడియోలతో కవ్వించి.. ప్రలోభ పెట్టి.. ఆశ చూపి.. ఆపై బెదిరింపులకు దిగి లక్షలు వసూలు చేసింది ఓ కిలేడీ.. అమె చేతికి చిక్కి విలవిల్లాడిన ఓ వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాలు..

Telangana: కిలేడీ వలపు వలలు.. నగ్న వీడియోలతో కవ్వింపులు.. ఆపై బెదిరింపులు.. కట్ చేస్తే..
Nude Call Video
Follow us on

న్యూడ్ వీడియోలతో కవ్వించి.. ప్రలోభ పెట్టి.. ఆశ చూపి.. ఆపై బెదిరింపులకు దిగి లక్షలు వసూలు చేసింది ఓ కిలేడీ.. అమె చేతికి చిక్కి విలవిల్లాడిన ఓ వ్యక్తి.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయాలు తెలిశాయి. హైదరాబాద్ నగరంలోని చంపాపేట్‌లో గవర్నమెంట్‌ ఉద్యోగి నుంచి రూ.5లక్షలు వసూలు చేసింది. కామారెడ్డిలో యువకుడికి వీడియో కాల్‌ బెదిరింపులతో రూ. 60 వేలు కొట్టేసింది. నెంబర్లు సంపాదించి.. వారికి వీడియో కాల్ చేస్తారు. మాటల్లో పెట్టి నగ్నంగా మారాలని ప్రేరేపిస్తారు. ఆపై మాట్లాడుకున్న వీడియోను కాల్ రికార్డ్ చేస్తారు. తర్వాత వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి లక్షలు కాజేస్తున్నారు.

చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. ఓ రోజు ఆయనకు ఓ నంబర్‌ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేస్తే అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహం పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో కవ్వించింది.. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్‌ చేశాడు. వీడియో కాల్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు.

ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్‌ చేసి పోలీసునని చెప్పి బెదరింపులు స్టార్ట్ చేశాడు. యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్‌ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యాడు. తాము చెప్పినట్లు వినకపోతే వీడియో కాల్‌ను సోషల్‌ మీడియాలో పెట్టి కేసు ఫైల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేయాలో తెలియక సైబర్ పోలీసులను న్యాయం కోరుతూ ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..