TGSRTC: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ముగిసిన డిస్కౌంట్.. అమల్లోకి పాత ఛార్జీలు!

హైదరాబాద్‌లోని ఆర్టీసి ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక సూచనలు చేసింది. సమ్మర్ ఎండల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశ పెట్టిన డిస్కౌంట్ ఆఫర్ మే 30తో ముగిసిందని.. దీంతో జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత ఛార్జీలు తిరిగి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. కాబట్టి ప్రయాణికులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

TGSRTC: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ముగిసిన డిస్కౌంట్.. అమల్లోకి పాత ఛార్జీలు!
Tgsrtc

Updated on: May 30, 2026 | 8:36 PM

హైదరాబాద్, మే 30: హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రయాణికులకు TGSRTC కీలక సూచనలు చేసింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రవేశపెట్టిన ప్రత్యేక సమ్మర్ డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగిసినట్టు ప్రకటించింది. మూడు నెలల (మార్చి, ఏప్రిల్, మే) పాటు ఇచ్చిన రాయితీ గడువు ముగియడంతో, జూన్ 1 నుండి మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో పాత చార్జీలను యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

అయితే ఈ మార్పుపై ప్రయాణికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఒక ముఖ్యమైన స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో కొత్తగా ఎలాంటి ఛార్జీలను పెంచలేదని, కేవలం వేసవి కాలం కోసం ప్రత్యేకంగా అందించిన సమ్మర్ డిస్కౌంట్ గడువు మాత్రమే ముగిసిందని పేర్కొంది. కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సంస్థకు సహకరించాలని అధికారులు కోరారు.

మార్చి నుండి మే 31 వరకు రాయితీలు

తీవ్రమైన ఎండల దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సుఖవంతమైన, ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మార్చి 2026 నుండి మే 31, 2026 వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మూడు నెలల పాటు కొనసాగిన ఈ ఆఫర్ గడువు ముగియడంతో జూన్ మొదటి తేదీ నుండి రాయితీకి ముందు ఉన్న పాత టికెట్ ధరలే అమలులోకి వస్తాయని పేర్కొంది.

ప్రయాణికులకు కృతజ్ఞతలు

తీవ్ర వేసవి దృష్ట్యా సామాన్య ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశ్యంతో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమ్మర్ ఆఫర్‌ను నిర్వహించడం జరిగింది. ఈ మూడు నెలల పాటు ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఆర్టీసీకి సహకరించిన ప్రయాణికులకు సంస్థ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us