Hyderabad: ఉత్సాహం చూపని హైదరాబాదీలు.. పాతబస్తీలో మందకొడిగా సాగుతున్న పోలింగ్..
Hyderabad Lok Sabha Election 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.

Hyderabad Lok Sabha Election 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అయితే, ఎప్పటిమాదిరిగానే హైదరాబాద్ లో ఓటు వేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపడం లేదు.. 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా.. చాలామంది ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపడం లేదు.. దీంతో హైదరాబాద్ పాతబస్తీలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.. దీంతో ఓటర్లు లేక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
ఉదయం నుంచి అర్బన్ పార్లమెంట్ స్థానాల్లో మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఓటు వేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపడంలేదు.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 5.06 శాతం పోలింగ్ నమోదు అయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కూడా మందకొడిగా పోలింగ్ కొనసాగుతోంది..
కాగా.. హైదరాబాద్ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ శాస్త్రీపురంలో ఓటు హక్కును వినియోగించుకోగా.. బీజేపీ అభ్యర్థి మాధవీలత.. అమృత విద్యాలయం మహింద్రా హిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..