TV9 Sweet Home: హైటెక్స్‌లో టీవీ9 స్వీట్‌ హోం రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో.. మీ స్ధిరాస్తి కల నెరవేర్చుకునే ఒకే ఒక్క వేదిక

|

Apr 14, 2023 | 11:14 AM

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా.. మీ బడ్జెట్ పరిధిలో, మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా..

TV9 Sweet Home: హైటెక్స్‌లో టీవీ9 స్వీట్‌ హోం రియల్‌ ఎస్టేట్‌ ఎక్స్‌పో.. మీ స్ధిరాస్తి కల నెరవేర్చుకునే ఒకే ఒక్క వేదిక
Tv9 Real Estate Expo 2023
Follow us on

మీరు ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా.. మీ బడ్జెట్ పరిధిలో, మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా మీరు సందర్శనాచాల్సిన ప్లేస్ TV9 Sweet Home Real Estate & Interior Expo. ఈ స్వీట్‌హోం ఎక్స్‌పోను తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొంటున్న ఈ ఎక్స్ పో ఈ నెల ఏప్రిల్ 14,15,16 తేదీల్లో 3 రోజుల పాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతోంది. ఆకర్షనీయమైన ఇంటీరియర్, ఫర్నీచర్ మరియు అద్భుతమైన హెూం డెకొరేషన్ డిజైన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ స్వీట్‌హోంలో ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్ధలు తమ స్టాల్స్‌ని ఏర్పాటు చేశాయి. హైటెక్స్‌లో 3 రోజుల పాటు జరుగుతున్న ఈ ఎక్స్‌పోకి ప్రవేశం ఉచితం.

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్హిలో దూసుకుపోతున్న హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్లాట్, ఓపెన్ ప్లాట్, కమర్షియల్ ప్రొపర్టీ, రెసిడెన్షియల్ ప్రొపర్టీ, ఫామ్ హౌస్, విల్లా లాంటి స్థిరాస్తి కొనాలనుకున్నా నాణ్యమైన సలహా అవసరం. అందుకే మీ అవసరాలకు అనుగుణంగా మీ బడ్జెట్ పరిధిలో మీ స్థిరాస్తి కల నెరవేర్చుకునే వేదిక సిద్ధం చేసింది TV9 తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీ, విల్లా, ఫాం హౌస్ ఎలాంటి స్థిరాస్తి కొనాలనుకున్నామీరు సందర్శనాచాల్సిన ప్లేస్. మీ కోసం స్థిరాస్తితో పాటు సరికొత్త ఫర్నీచర్, ఇంటిరియర్ డిజైన్లతో పాటు మరెన్నో గృహలంకరణ వస్తువులు అన్ని ఒకేచోటకు తీసుకువచ్చింది TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పో.

TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పో’ ఈరోజు శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉదయం 10 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌ హైటెక్ సిటీలోని హైటెక్స్‌లో జరగనుంది. అపర్ణ, మైహోం, రాజ్ పుష్ప,వాసవి గ్రూప్, సుచిర్ ఇండియా, శ్రీ భ్రమర , వెర్టెస్, శుభ గృహ, శ్రీనిధి లాంటి అత్యంత విశ్వసనీయమైన దిగ్గజ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు వందకు పైగా కంపెనీలు TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోలో భాగస్వామ్యం కానున్నాయి.

ఫర్నీచర్, ఇంటిరీయర్ డిజైనింగ్, వాటర్ ఫౌంటెన్, వాల్ ఆర్ట్ డెకరేషన్, ఇంకా మరెన్నో గృహలంకరణ డిజైన్లు, వస్తువుల గురించి సమగ్ర సమాచారాన్ని ఈ ఎక్స్‌పోలో తెలుసుకోవచ్చు. దీంతో పాటు వివిధ బ్యాంకులు అందిస్తున్న లోన్ల వివరాలు, అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు అందించే బ్యాంకుల గురించి అవసరమైన సమాచారం ఈ ఎక్స్ పోలో పొందొచ్చు. అందరూ TV9 స్వీట్ హోమ్ అండ్ ఇంటీరియర్ ఎక్స్‌పోలో సందర్శించి తమ కలను నిజం చేసుకోవాలని టీవీ9 నెట్వర్క్ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది.