
సాధారణంగా మనకు ఏదైనా ప్రింట్ కావాలి అనుకుంటే వెంటనే జిరాక్స్ షాప్‌ల కోసం వెతుకుతాం. అక్కడికి వెళ్లి ప్రింట్ తీసుకుంటాం. ఒక వేళ మనకు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ షాప్‌లు లేకపోతే ఇక అంతే సంగతులు. కానీ హైదరాబాదీలకు ఇకపై ఆటెన్షన్ లేనట్టే. ఎందుకంటే ఇప్పడు హైదరాబాద్‌వాసులకు సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏటీఎం తరహాలో నగరంలో క్విక్ ప్రింట్ పేరుతో సరికొత్త ప్రింటింగ్ మిషన్‌లు ఏర్పాటు అవుతున్నాయి. మీకు ఏదైనా ప్రింట్ కావాలి అనుకుంటే ఈ క్విక్ ప్రింట్ మిషన్స్ దగ్గరకు వెల్లి మీ మొబైల్ ద్వారా మిషన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కావాల్సిన ప్రింట్‌ను క్షణాల్లో పొందవచ్చు.
ఇప్పుడు ఈ సరికొత్త టెక్నాలజీ హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నగరంలోకి కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఈ కియోస్క్ క్విక్ ప్రింట్ మిషన్‌లను ఏర్పాటు చేశారు. చెన్నైకి చెందిన ఇద్దరు యువకులు ఈ మిషన్‌ను కూకట్ పల్లి మెట్రో వద్ద ఇన్‌స్టాల్ చేశారు. ఏదైనా ప్రింట్ కావాలి అనుకున్న వారు ఇక్కడ మిషన్ వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రింట్‌ను పొందుతున్నారు.
క్విక్ ప్రింట్ మిషన్‌లో ప్రింట్ ఎలా తీసుకోవాలి
ఇప్పుడు ఈ క్విక్ ప్రింట్ మిషన్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. జిరాక్స్ షాప్‌లకు వెళ్లే అవసరం లేకుండా ఇదేదో బాగుందని నెటిజన్‌లు అంటున్నారు. వీటిని నగర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తే చాలా బాగుంటుందని నగరవాసులకు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.