Hyderabad: ఓరి దుర్మార్గులారా ఎంతకు తెగించార్రా.. ఇన్ స్టాను అడ్డాగా చేసుకుని..

మత్తు ఈ మాట విన్పించినా..డ్రగ్స్‌ జాడ కన్పించినా ఓ రేంజ్‌లో మడతేస్తున్నారు తెలంగాణ పోలీసులు. రాజేంద్రనగర్‌లో బెంగళూరు డ్రగ్‌ రాకెట్‌ను బ్రేక్‌ చేసిన ఖాకీలు, మత్తుగాళ్లను కటకటాల బాటపట్టించారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ... .. . .

Hyderabad: ఓరి దుర్మార్గులారా ఎంతకు తెగించార్రా.. ఇన్ స్టాను అడ్డాగా చేసుకుని..
Instagram

Updated on: Nov 06, 2025 | 10:21 PM

మహానగరంలో మత్తు మాఫియా బెండు తీస్తున్నారు పోలీసులు. డీసీపీ యోగేష్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు నిర్వహించిన జాయింట్‌ ఆపరేషన్‌లో బెంగళూరు డ్రగ్‌ డొంకలు కదిలాయి. సాయిబాబు, విశాల్‌ రెడ్డి, సమీర్‌ అనే వ్యక్తులు డ్రగ్స్‌ కొనుగోలు చేస్తూ ఖాకీలకు అడ్డంగా బుక్కయ్యారు. ఆ ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి దగ్గర నుంచి 2 లక్షలు విలువచేసే 18 గ్రాముల MDMA, 130 గ్రాముల గంజాయి సహా 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కూపీలాగితే సంతోష్, సందీప్, శివ కుమార్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ముగ్గురు బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకు వచ్చి హైదరాబాద్‌లో దందా చేస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

నిందితులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆర్డర్‌ తీసుకొని పెడ్లర్లతో డోర్‌ డెలవరీ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. బెంగళూరు డ్రగ్‌ డొంకతో పాటు నైజీరియన్‌ లింకులు తెరపైకి వచ్చాయి. నైజీరియా నుంచి బెంగళూరుకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామన్నారు డీసీపీ యోగేష్‌ గౌతమ్‌. నైజీరియా టు హైదరాబాద్‌ వయా బెంగళూరు డ్రగ్‌ చైన్‌ను త్వరలోనే బ్రేక్‌ చేస్తామన్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? కన్స్సూమర్ల మరెంత మంది ఉన్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే సంతోష్,సందీప్, శివ కుమార్ ఆ ముగ్గురి డ్రగ్‌ డెలవరీ డైరీపై ఫోకస్‌ పెట్టారు. డ్రగ్స్‌ వాడినా.. అమ్మినా..కొన్నా..డ్రగ్‌ దందాకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీసీపీ యోగేష్‌ గౌతమ్‌.