Hyderabad: భగ్గుమంటున్న భానుడు.. ఏసీలు, ఫ్రిజ్ లకు పెరిగిన డిమాండ్.. అందులోనూ వాటి కోసమే..

సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నమైతే నిప్పుల కుంపటిలో ఉన్నట్లే ఉంటోంది. ఇక రాత్రిపూట కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దంచికొడుతున్న....

Hyderabad: భగ్గుమంటున్న భానుడు.. ఏసీలు, ఫ్రిజ్ లకు పెరిగిన డిమాండ్.. అందులోనూ వాటి కోసమే..
Ac
Follow us

|

Updated on: May 18, 2022 | 3:45 PM

సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలకే ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక మధ్యాహ్నమైతే నిప్పుల కుంపటిలో ఉన్నట్లే ఉంటోంది. ఇక రాత్రిపూట కూడా గరిష్ఠ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. దంచికొడుతున్న ఎండలకు హైదరాబాద్(Hyderabad) నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో సతమతమవుతున్నారు. దీంతో కూలర్లు, ఫ్రిజ్ లు, ఏసీలకు గిరాకీ ఏర్పడింది. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని కొనేస్తున్నారు. గతేడాది మార్చితో పోలిస్తే హైదరాబాద్ లో ఈసారి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల కొనుగోళ్లు సగటున 25 శాతానికి పైగా పెరిగాయి. ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా దిల్లీ, హైదరాబాద్‌లోనే కొనుగోళ్లు పెరిగినట్లు ప్రకటించిన సంస్థ.. తర్వాతి స్థానాల్లో చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ ఉన్నాయని వెల్లడించింది. సాధారణంగా వేసవి ప్రతాపం ఏప్రిల్‌ చివరిలో ప్రారంభమవుతుందని, ఈసారి మార్చి నుంచే ఉండటం కొనుగోళ్లు పెరగడానికి కారణమని తెలిపింది. మరోవైపు.. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న పరికరాలు అందుబాటులో ఉండటంతో స్మార్ట్ పరికరాలకే వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు.

సాధారణ ఏసీలు కాకుండా స్మార్ట్ గా ఉండేవి, వైఫై సదుపాయంతో తక్కువ విద్యుత్‌ ఉపయోగించుకునే వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. సెల్ఫ్‌ క్లీనింగ్‌, యాంటి వైరస్‌ సదుపాయం, పర్యావరణహితంగా ఉండే వాటిని కొనుగోలు చేసేందుకు అధిక ఆసక్తి చూపుతున్నారు. పవర్ లేకున్నా బ్యాటరీతో పనిచేసే వాటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Viral video: బాబోయ్…ఆ ఇంటి వరండాలో షాకింగ్‌ సీన్‌..సంతానోత్పత్తి కోసం వచ్చిన మూడు జతల పైథాన్‌లు..

Latest Articles
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.