Hyerabad Police: రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారం పోలీసులకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు సీరియస్ గా దృష్టిపెట్టి జండాలు కట్టిన NSUI కార్యకర్తల పై కేసు నమోదు చేశారు. ఈ చర్యకు పాల్పడ్డ శైలీ౦ధర్ సింగ్ , హబీబ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇలా ఉండగా, నిన్న(శుక్రవారం) ఏఐసీసీ పిలుపుమేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా ‘చలో రాజ్ భవన్’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న ఉదయాన్నే ఇద్దరు వ్యక్తులు రాజ్ భవన్ దగ్గరకు ప్రవేశించడమేకాదు, ఏకంగా గేట్లకు కాంగ్రెస్ జెండాలు కట్టేశారు.
సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ బసచేసే రాజ్ భవన్ దగ్గర పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఉండటం సహజం. అలాంటిది ప్రధాన ప్రతిపక్షం నిరసనకు పిలుపునిచ్చిన వేళ, పోలీస్ లను తప్పించుకుని జెండాలు ఎలా కట్టగలిగారన్నది చర్చనీయాంశమైంది. దీనికితోడు, రాజ్ భవన్ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలు సైతం పనిచేయకపోవడం పై విమర్శలు వెల్లువెత్తడం ఈ కేసు పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది.
Read also: Fake DSP: ఫేక్ పోటుగాడు : డీఎస్పీ డ్రెస్‌లో బిల్డప్ ఇచ్చి.. ఎన్ని యవ్వారాలు చక్కబెట్టాడంటే..!