హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!

హైదరాబాద్‌ నగరంలో మరో విద్యాకుసుమం రాలిపోయింది. పోటీ పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక, ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాననే తీవ్ర మానసిక మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పాతబస్తీ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాకుత్‌పురాలోని సూర్యార్జంగ్‌ దేవ్డీ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ రియాన్‌ (20) అనే విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
Hyderabad NEET Student Death

Edited By:

Updated on: Oct 29, 2026 | 12:46 PM

నీట్‌ పరీక్షలో ఆశించిన ర్యాంకు సాధించలేకపోయాననే మనస్తాపంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో విషాదాన్ని నింపింది. యాకుత్‌పురాలోని సూర్యార్జంగ్‌ దేవ్డీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మహమ్మద్‌ రియాన్‌ (20)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాన్‌ నీట్‌ పరీక్ష కోసం చాలాకాలంగా కోచింగ్‌ తీసుకుంటున్నాడు. అయితే, పరీక్షలో ర్యాంకు సాధించకపోవడంతో గత రెండు నెలలుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు అతడి తండ్రి అబ్దుల్‌ గఫూర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అక్టోబర్‌ 28న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అబ్దుల్‌ గఫూర్‌, ఆయన భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బంధువులను పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కుమార్తె కూడా ఇంట్లో లేదు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తల్లిదండ్రులు తిరిగి ఇంటికి వచ్చేసరికి రియాన్‌ కనిపించలేదు. బెడ్‌రూమ్‌ తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో అనుమానం వచ్చి తలుపు తెరిచి చూశారు. గదిలో కుమారుడు కనిపించకపోవడంతో బాత్‌రూమ్‌లో పరిశీలించగా, అక్కడ విగతజీవిగా కనిపించాడు. తండ్రి వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నీట్‌లో ర్యాంకు రాకపోవడంతో ఏర్పడిన మానసిక ఆందోళనే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. మదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో.. ఆశించిన ఫలితాలు రాకపోయినా ధైర్యం కోల్పోకుండా, మానసిక ఆందోళన ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం ఎంతో ముఖ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us